మన శరీర భాగాలు సరిగ్గా పని చేయాలంటే రక్తప్రసరణ చాలా అవసరం. ఈ రక్త ప్రసరణ వల్ల అవసరమయ్యే భాగాలకు ఆక్సిజన్, శక్తిని , పోషకాలను రవాణా చేస్తుంది. అందుకే రక్తసరఫరా మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి. అలా రక్త ప్రసరణ బాగా జరగడం వల్ల అన్ని భాగాలు చురుగ్గా పనిచేస్తాయి. అయితే రక్తసరఫరా సరిగ్గా జరగకపోతే అనేక సమస్యలు వస్తాయి. అందులో ముఖ్యంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకోసం మనం నిత్యం ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో రక్తసరఫరా మెరుగుపరచకపోవచ్చు. కానీ ఇప్పుడు చెప్పబోయే కొన్ని ఆహార పదార్థాల వల్ల తప్పకుండా రక్తసరఫరా మెరుగు పడుతుంది.అయితే అవి ఏంటో ఒక సారి చూద్దాం.


1).దానిమ్మ పండ్లను నిత్యం తీసుకోవడం వల్ల రక్తం బాగా ఉత్పత్తి అవుతుంది. అంతేకాకుండా రక్తసరఫరా కూడా మెరుగుపడుతుంది. అలాగే బీట్ రూట్, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టొమోటోలు వంటి వాటి వల్ల కూడా రక్త సరఫరాను మెరుగుపరుచుకోవచ్చు.


2). నిమ్మకాయ, బత్తాయి పండు, ఆరెంజ్ పండు  వాటిని జూస్ చేసి తాగడం వల్ల కూడా రక్తం సమృద్ధిగా పెరిగి, రక్త సరఫరాను  మెరుగుపరచుటలో ఎంతగానో దోహదపడుతుంది.


3). వాల్ నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వుండడం వల్ల వెంట్రుకల పెరుగుదల,  మెదడుని చురుకుగా ఉంచడంలో ఎంతగానో మేలు చేస్తాయి. అయితే ప్రతి రోజూ తీసుకోవడం వల్ల రక్తం సరఫరా మెరుగుపడుతుంది.

4). తాజా ఆకుకూరలు,కూరగాయలు, చెర్రీస్ తినడం వల్ల కూడా శరీరంలో రక్తం సరఫరా మెరుగుపడుతుంది. అంతే కాకుండా గుండె ఆరోగ్యవంతంగా పనిచేస్తుంది. హైబీపీ ఉన్నవారు వీటిని తీసుకుంటే బీపీని నియంత్రించవచ్చు.


ఇక ప్రతి రోజూ వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల మన శరీరంలో రక్తం వృద్ధి చెందడమే కాకుండా రక్తహీనత సమస్య కూడా తొలగిపోతుంది. అంతేకాకుండా అన్ని శరీర అవయవాలకు కావలసిన ఆక్సిజన్, రక్తం సరఫరా అవడమే కాకుండా  నిత్యం ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడతాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: