ఇక వర్షాకాలం వచ్చేసింది. వాన అంటే చాలామందికి ఇష్టం. ఈ కాలంలో అందమైన వాతావరణం ఇంకా బయట వర్షం పడుతుంటే వేడి వేడి స్నాక్స్ తింటూ ఈ కాలం ఎంజాయ్ చెయ్యడం అందరికీ ఇష్టమైన పనులే.. అయితే వానా కాలం కేవలం ఎంజాయ్ మెంట్ నే కాదు ఎన్నో రకాల జబ్బులను కూడా తీసుకొస్తుంది. డెంగ్యూ, చికన్ గున్యా, మలేరియా, కలరా, టైఫాయిడ్, డయేరియా, వైరల్ ఫీవర్ వంటి ఎన్నో జబ్బులు ఈ వానా కాలంలోనే ఎక్కువగా వస్తూ ఉంటాయి.అలాగే జలుబు, దగ్గు, జ్వరం వంటి మాములు సమస్యలు కూడా తెగ ఇబ్బంది పెడుతుంటాయి.ఇక వీటిని తగ్గించేందుకు కొన్ని చిట్కాలు తప్పకుండా పాటించాలని  ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) విభాగం వారు చెబుతున్నారు.

కేంద్ర కుటుంబ ఇంకా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ విభాగం వానా కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించేందుకు కొన్ని చిట్కాలను అందించడం జరిగింది. వీటిని పాటించడం వల్ల వానా కాలంలో వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని వెల్లడించడం జరిగింది.ఇక ఈ వానా కాలంలో ఎప్పుడూ కూడా తాజా ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ఎక్కువగా వండుకోకుండా మీకు అవసరం ఉన్నంత మాత్రమే ఆహారాన్ని వండుకోండి. ఒకవేళ ఆహారం కనుక ఏమైనా మిగిలితే రిఫ్రిజిరేటర్‌లో పెట్టి ఉంచండి.ఇందువల్ల సూక్ష్మ జీవులు అనేవి పెరగకుండా ఉంటాయి. ఇక ఆ తర్వాత వేడి చేసి తినండి.ఇంకా పాలు, పెరుగు వంటి పదార్థాలను ఖచ్చితంగా ఈ కాలంలో ఫ్రిజ్ లో పెట్టడం చాలా మంచిది.అలాగే తాజా పదార్థాలు ఇంకా కూరగాయలు మాత్రమే  తెచ్చుకొని వంట వండుకోవడం మంచిది.ఇక అలాగే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, పసుపు, మిరియాలు వంటి వంటింటి పదార్ధాలు ఉపయోగించడం వల్ల బాడీలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అలాగే ఈ వానా కాలంలో వచ్చే సమస్యల నుంచి మిమ్మల్ని మీరు సురక్షితంగా కాపాడుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: