స్నానం చేయడం అనేది దినచర్యలో చాలా ముఖ్యమైన భాగం. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ స్నానం చేయాల్సిందే. కానీ ఏ సమయంలో స్నానం చేయడం మంచిది ? ఏ టైంలో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సరైన సమయంలో స్నానం చేస్తే ఆరోగ్యం మరింత బాగుంటుంది. కొన్ని సమయాల్లో స్నానం చేయడం కరెక్ట్ కాదు.

ఏ సమయంలో స్నానం చేయాలి?
ఇది వింతగా అనిపించవచ్చు. కానీ ఉదయం కంటే సాయంత్రం స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుందనేది నిజం. అనేక నివేదికల ప్రకారం రాత్రి స్నానం చేయడం ఇంకా మంచిది. నిజానికి రాత్రిపూట స్నానం చేయడం వల్ల చర్మానికి మంచిది. ప్రత్యేకించి వేసవి లో లేదా వర్షాకాలం లో చేస్తే ఇంకా ఆరోగ్యకరం. నిజానికి ఎక్కువసేపు బయట ఉండటం వల, మీ చర్మం మీద మట్టి, చెమట మొదలైనవి ఎక్కువగా ఉంటాయి.  వాటి వలన వచ్చే వ్యాధులను నివారించడానికి సాయంత్రం స్నానం చేయడం మంచి అలవాటు. అందువల్ల పడుకునే ముందు మీ శరీరాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవడం అవసరం. అలాగని ఉదయం స్నానం చేయడం తప్పు కాదు. సాయంత్రం స్నానం చేయడం వల్ల మీ రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రాత్రిపూట స్నానం చేయడం వల్ల వేడి కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరగడం పెరిగి రక్తపోటు సరిగ్గా ఉంటుంది. ఇది గాఢ నిద్రకు కూడా సహాయపడుతుంది. ఒత్తిడిని చాలా దూరంగా ఉంచవచ్చు.

ఏ సమయంలో స్నానం చేయకూడదు?
ఆయుర్వేదం ప్రకారం భోజనం చేసిన వెంటనే మీరు స్నానానికి చేయొద్దు. ఒకటి నుండి రెండు గంటల తరువాత స్నానం చేయాలి. నిద్రకు ముందు స్నానం చేయడం మానుకోండి. నిద్రకు, స్నానానికి మధ్య అంతరం ఉండాలి. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు స్నానం చేస్తే సరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: