సాధారణంగా మన పూర్వీకులు ప్రతిరోజు జొన్న రొట్టెలు, జొన్నలతో చేసిన ముద్దులను ప్రతిరోజూ ఆహారంలో భాగంగా చేసుకొని తినేవాళ్ళు. అందుకే వాళ్లు అంత ఆరోగ్యంగా ఎలాంటి సమస్యలు లేకుండా జీవించే వాళ్ళని అని చెబుతూ ఉండేవారు.. అంతేకాదు అమ్మమ్మ, నాన్నమ్మ ,తాతయ్యలు మనం కలిసినప్పుడు వాళ్ళు ఎంత దృఢంగా ఉంటారో, వాళ్లు తినే ఆహారాన్ని బట్టి చెప్పేయవచ్చు.. ఆ కాలంలో వాళ్లు తినే ఆహారం ఎన్నో పోషకాలతో నిండి ఉండేది కాబట్టి , అంత ఎక్కువ కాలం జీవిస్తూ ఉండేవారు.. నేటికాలంలో జొన్న రొట్టెలు తినడానికి చాలా మంది ఇష్టపడడం లేదు..


ఇకపోతే డయాబెటిస్ రోగులకు జొన్నరొట్టెలు మేలు చేస్తాయా అనే విషయం ప్రస్తుతం వైరల్ గా  మారింది..మన భారతదేశం లో జొన్నలను ఒక్కో చోట ఒక్కోలా ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ వుంటారు. కొన్ని చోట్ల జొవార్‌, ఇంకొన్ని చోట్ల సొర్గుమ్‌  అని పిలుస్తూ వుంటారు. ఇంకొందరు అయితే జొన్నలను కొత్త రకం క్వినోవా అని కూడా పిలుస్తున్నారు. జొన్నలను ఎవరు ఎలాంటి భాషలో పిలిచి ఉన్నప్పటికీ వీటి ప్రయోజనాలు మాత్రం ఒకే రకంగా ఉంటాయి రకంగా ఉంటాయి..

డయాబెటిస్ రోగులు ఎక్కువ అవుతున్న కారణంగా ప్రతి ఒక్కరు జొన్న రొట్టెలు తినడానికి ముందుకు వస్తున్నారు. జొన్న రొట్టెలు చాలా బలవర్ధకమైన ఆహారమే కాదు కండ పుష్టి, ఎముక పుష్టి కూడా ఉంటుంది. జొన్న పిండితో చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల శరీరంలో త్వరగా జీర్ణం అయి బరువు తగ్గుతారు అని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు.

జొన్న పిండి లో గ్లూటెన్ ఉండదు. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల త్వరగా తిన్న ఆహారం జీర్ణం అవుతుంది.
రక్తంలోని  చక్కెర స్థాయిని జొన్న రొట్టెలు తగ్గిస్తాయి కాబట్టి డయాబెటిస్ రోగులు తప్పకుండా జొన్న రొట్టెలను తినవచ్చు. ప్రోటీన్ , ఐరన్, మెగ్నీషియం,కాల్షియం, కాపర్, జింక్, విటమిన్ B3 ఉండడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. రక్త ప్రసరణ పనితీరును మెరుగుపరిచి గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అంతే కాదు అధిక బరువు తగ్గడంతో పాటు కండరాలు కూడా దృఢంగా మారుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: