దేశంలో కరోనా రెండు వేవ్ లు విజయవంతంగా పూర్తిచేసుకుంది. మొదటి వేవ్ లో ధీటుగా నిలబడినప్పటికీ, రెండో వేవ్ లో కాస్త తడబడిన భారత్ త్వరగానే కోలుకుంది. మొత్తానికి ఇటీవలే కాస్త కేసులు తగ్గుముఖంపట్టడం కూడా చూశాం. అలాగే అందరికి మూడో వేవ్ అనే భయం కూడా పట్టుకుంది. అది పిల్లలపై ప్రభావం చూపిస్తుందని ఆరోగ్యశాఖ కూడా స్పష్టం చేసింది. కానీ అది అంతగా ప్రభావం చూపకపోవడం కూడా అందరు గమనించారు. అందుకే దాదాపుగా అన్ని విద్యాలయాలు కూడా కరోనా నియమాలను పాటిస్తూ నడిపించడానికి కూడా సిద్ధం అయ్యారు. అలా మొదలైన విద్యాలయాలలో కాస్తో కూస్తో కేసులు కూడా కనిపించడంతో అప్పటికి కొన్ని నిబంధనలను కఠినతరం చేశాయి ఆయా ప్రభుత్వాలు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం భారత్ నుండి కరోనా వెళ్ళిపోయింది అనుకున్న సమయంలో దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ బయటపడటం, దాని వలన వ్యాప్తి డెల్టా కంటే దారుణంగా ఉంటుందని హెచ్చరికలు రావడం నేపథ్యంలో జాగర్తలు కరోనా కొత్తప్పటి రోజులను గుర్తు చేసింది. ఏది ఏమైనా అంతర్జాతీయ ప్రయాణాలు ఉన్నాయి కాబట్టి, టూరిస్టుల రాకపోకలు ఉన్నాయి కాబట్టి కొత్త రకం వ్యాప్తి ఉండొచ్చు అనేది అధికారుల అంచనా. అందుకే తాజాగా అంతర్జాతీయ ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం మరోసారి దానిపై ఆలోచనలో పడింది. టూరిస్టులు కూడా వేరే వేరే దేశాల నుండి దారులు మార్చుకొని మరి వస్తుండటం ఇక్కడ మరో సమస్యగా పరిణమించింది.

ఇవన్నీ నేపథ్యంలో ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ, భారత్ లో మూడో వేవ్ ఇంకా రాలేదని, 2022 జనవరిలో వస్తుందని అభిప్రాయపడ్డారు. డెల్టా తో పోల్చుకుంటే తాజా వేరియంట్ రెండింతలు వేగంగా వ్యాప్తి చెందుతుందని గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తుందని, అందుకే ఇప్పటి నుండే తగిన పరిమితులతో కఠిన నిబందనలు విదిస్తూపోతే, ఈ ప్రమాదం నుండి కూడా బయటపడొచ్చని అన్నారు. ఒక జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఫిబ్రవరి లో గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని, అప్పుడు రోజుకు 1.5 లక్షల కేసులు నమోదు అవడానికి అవకాశాలు ఉన్నాయని అన్నారు. టీకా తీసుకోవడం వలననే కొత్త వేరియంట్ వ్యాప్తి నిదానంగా ఉన్నాడని, లేకుంటే ప్రభావం ఇంకా తీవ్రంగా ఉండేదని ఆయన అన్నారు. టీకా వేసుకున్న తరువాత కూడా వ్యాప్తి ఉన్నదంటే కొత్త వేరియంట్ తో జాగర్తగా ఉండటం అవసరం అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: