ప్రపంచం కరోనా ప్రభావంతో ఒణికిపోయిన అసలు ఒక్క కేసు కూడా నమోదు కాకుండా జాగర్త పడిన ప్రాంతాలు కూడా లేకపోలేదు. అందులో కొన్ని దేశాల పేర్లు కూడా ఉన్నాయి. అలాంటి జాగర్తలు వాళ్ళు తీసుకోగలిగారు. వారి ముందస్తు జాగర్తలు అందరికి స్ఫూర్తిని ఇచ్చాయని చెప్పాలి. ఆ దిశగా అందరు వెళ్లే ప్రయత్నాలు చేశారు. అందుకే చాలామంది త్వరగా బయటపడ్డారు అని చెప్పొచ్చు. ఇప్పటికి ముందస్తు జాగర్తలు పాటించని దేశాలు కరోనా తో అల్లాడిపోతూనే ఉన్నాయి. దానికి ప్రధాన ఉదాహరణగా అమెరికానే చెప్పుకోవాలి. అక్కడ ఇప్పుడే కాస్త తగ్గుతున్నాయి అనుకునే లోపుగానే కేసులు మళ్ళీ పెరిగిపోతున్నాయి. తాజా వేరియంట్ కేసులు కూడా అక్కడకు రాకుండా వాళ్ళు ఈసారి ముందస్తు జాగర్తలు తీసుకున్నప్పటికీ అవి నమోదు అయినట్టు తెలుస్తుంది.

ఇలా కొత్త వేరియంట్ వచ్చిన కొన్నాళ్లలోనే దాదాపుగా 40 దేశాలకు పాకేసింది. ఎన్నడూ కరోనా బారిన పడని దేశాలు కూడా ప్రస్తుతం ఆ ప్రభావాన్ని చుస్తున్నాయంటే దాని ప్రమాదం అర్ధం చేసుకోవచ్చు. మొదటి రెండవ వేవ్ లలో ఒక్క కేసు కూడా నమోదు కాకుండా జాగర్త పడిన కుక్ ఐలాండ్ లో కరోనా ప్రవేశించ గలిగింది. ఆ ఒక్క కేసు ను నియంత్రిస్తారో లేదో చూడాలి. ఈ ఐలాండ్ సౌత్ పసిఫిక్ దేశం. జనాభా 17వేలు మాత్రమే. ఇక్కడ మొదటి కేసు డిసెంబర్ 4న పదేళ్ల పిల్లవాడితో బయటపడింది. అయితే ఇది కొత్త వేరియంట్ అవునా కదా అనేది తేలాల్సి ఉంది. బాలుడు 2వ తారీకున బయట నుండి స్వదేశానికి రావడం జరిగింది. అంటే బయట నుండి  అతడికి కరోనా వ్యాప్తి అయ్యిందని అర్ధం అవుతుంది.

ఇప్పటికే ఆ ఐలాండ్ లో అత్యధిక వాక్సినేషన్ రేట్ నమోదు అయ్యింది. అంటే దాదాపుగా అందరూ వాక్సిన్ తీసుకున్నవారే. దాదాపు 96 శాతంగా ఉంది ఇక్కడ వాక్సినేషన్ రేటు. అది కూడా రెండు డోసులు వేసున్నారు కూడా. అయితే పిల్లలకు ఇంకా రాలేదు కాబట్టి ఆ పిల్లవాడికి సోకి ఉండొచ్చు అని అభిప్రాయపడుతున్నారు. పిల్లలకు సహజంగా రోగనిరోధక శక్తి అధికంగానే ఉంటుంది కాబట్టి పెద్ద ప్రమాదం ఏమీ ఉండబోదని థర్డ్ వేవ్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసినప్పటికీ, జాగర్తలు మాత్రం అనివార్యమని హెచ్చరించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: