ఒకవైపు కరోనా..తాజాగా మరో వైపు ఒమిక్రాన్ దేశ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న విషయం తెలిసిందే.. ఇక అందుకే చాలామంది ఈ వైరస్ నుంచి దూరంగా వెళ్లడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు అయినా సరే మనలో రోగ నిరోధక శక్తి తక్కువ కావడం వల్ల ఈ వైరస్ పదే పదే ఇబ్బంది కలిగిస్తూ ఒక్కోసారి ప్రాణాలను కూడా తీసుకెళ్ళి పోతుంది. ఇప్పటికే ఎంతో మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.. ప్రతిరోజు ఉదయం వీటితో తయారుచేసిన ఒక కప్పు టీ తాగితే ఎలాంటి వైరస్ అయిన సరే దూరం అవ్వాల్సిందే అంటున్నారు వైద్యులు.. ఆ టీ వేటితో తయారుచేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


గులాబి పూలు.. గులాబీ పువ్వులు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమైన పువ్వులు అని చెప్పవచ్చు. ఇవి రకరకాల రంగులలో ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి.. ఏ చిన్న వెకేషన్ అయినా సందర్భం అయినా తప్పకుండా ఈ గులాబీ పువ్వులు ఉండాల్సిందే ..ముఖ్యంగా ప్రేమకు చిహ్నంగా ఈ గులాబీ పూలను ఉపయోగిస్తూ ఉంటారు.. అయితే ఇది కేవలం అలంకరణకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను కలుగజేస్తాయి.. గులాబీ రేకులతో టీ తయారు చేసుకొని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలగడంతో పాటు సర్వరోగ నివారిణిగా కూడా ఈ టీ  పనిచేస్తుందట.


అయితే వీటి కోసం గులాబీరేకులు లేదా గులాబీరేకులు పొడిని కూడా ఉపయోగించవచ్చు.. ఎలా తయారు చేసుకోవాలి అనే విషయానికి వస్తే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఒక గ్లాసు నీటిని పోసి దానిలో రెండు టేబుల్ స్పూన్ల గులాబీ రేకులు అయినా వాడొచ్చు లేదా ఒక టేబుల్ స్పూన్ గులాబీ రేకుల పొడిని అయినా ఉపయోగించవచ్చు. అందులో వేసి ఐదు నిమిషాలపాటు బాగా మరిగించాలి. ఇక ఆ నీటిని వడగట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ప్రతిరోజు ఉదయం తాగడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలను బయటకు పోవడంతో పాటు శరీరానికి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది..


దగ్గు, జలుబు, అజీర్ణం , కడుపు ఉబ్బరం, మలబద్ధకం, ఆందోళన ,ఒత్తిడి ,నిద్రలేమి, చెడు కొలెస్ట్రాల్, డయాబెటిస్ వంటి సమస్యలు అన్ని దూరం అవడం తో పాటు శరీరం లోకి ఏదైనా కొత్త వైరస్ వస్తే వాటిని ఎదుర్కోవడానికి యాంటీఇన్ఫ్లమేటరీ తోపాటు యాంటీబయోటిక్ లక్షణాలు సమృద్ధిగా పోరాడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: