వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు కడుపు నొప్పి సమస్య రావడం కామన్.. అంతేకాదు తినే తిండిలో కూడా ఏదైనా కల్తీ అయితే కచ్చితంగా కడుపునొప్పి వస్తుంది. పిల్లలతో పాటు పెద్దలు కూడా తరచూ కడుపునొప్పి తో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఇంటి నివారణ పద్ధతులు చాలా చక్కటి పరిష్కారాన్ని అందిస్తాయి. అక్రమ సంపాదనకు అలవాటు పడిన ఎంతో మంది వ్యక్తులు తినే ఆహారంలో కూడా కల్తీ చేస్తున్నారు. వీటివల్ల ఆరోగ్యం పాడవుతుంది. అజీర్తి , గ్యాస్ట్రిక్ సమస్యలు, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.

కొన్ని సార్లు  కడుపునొప్పి తీవ్రతరం అయి నీరసంగా అనిపించడం,  తలనొప్పి,  ఒళ్లు నొప్పులు వంటి సమస్యలకు కూడా దారి తీయవచ్చు. కడుపు నొప్పి అధికంగా ఉన్నప్పుడు అల్లం తీసుకుంటే తక్షణ ఉపశమనం కలుగుతుంది. మనకు యాంటీ ఆక్సిడెంట్ తో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల కడుపు నొప్పి నుంచి తక్షణ రిలీఫ్ కలుగుతుంది. అల్లం కు కొద్దిగా తేనె చేర్చి తీసుకోవడం వలన వాంతులు,  వికారం కూడా తొలగిపోతాయి. గోరు వెచ్చగా ఉండే ఉప్పు నీరు కూడా కడుపు నొప్పిని కూడా దూరం చేయడానికి సహాయపడుతుంది.

భోజనం తిన్న వెంటనే అసిడిటీ సమస్యతో బాధపడుతుంటే అలాంటి వాళ్ళు ఒక గ్లాస్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ సోంపు గింజలు  వేసి రాత్రంతా నానబెట్టాలి.  ఉదయాన్నే వడగట్టి ఆ నీటిని వేడి చేసుకొని తాగడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. రుచి కోసం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు,  ఒక టేబుల్ స్పూన్ తేనె కలుపుకొని తాగవచ్చు. కడుపులో నొప్పి,  మంట వంటి సమస్యలు ఏర్పడితే కొద్ది మొత్తంలో బెల్లం తినడం వల్ల కూడా కడుపు నొప్పి తగ్గుతుంది
 ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైములు  విడుదల అవడం వల్ల కడుపులో మంట సమస్య కూడా తగ్గిపోతుంది. కడుపు నొప్పి తో ఇబ్బంది పడుతుంటే ఇలాంటి చిట్కాలు పాటించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: