ఈ మధ్యకాలంలో ఇండియాలో సైలెంట్ హార్ట్ అటాక్స్ ఎక్కువగా చూస్తున్నాం. మరీ ముఖ్యంగా కరోనా బారిన పడి కోల్కున్న వాళ్లలో ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్ ఎక్కువగా గమనిస్తూ ఉండడం గమనార్హం. ఈ సైలెంట్ హార్ట్ అటాక్ కి ఎక్కువ లక్షణాలు కనిపించవు. సైలెంట్ గానే అది ప్రాణాలను హరించేస్తూ ఉంటుంది . మరీ ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఇండియాలో మూడు మిలియన్ల మందికి హార్ట్ ఎటాక్స్ వస్తూ ఉంటే దానిలో 25 నుంచి 30% సైలెంట్ హార్ట్ అటాక్స్ నే కావడం గమనార్హం. దాదాపు 7.5 నుంచి 9 లక్షల మంది సైలెంట్ హార్ట్ ఎటాక్ కారణంగానే చనిపోతున్నారట . కోవిడ్ 19 తర్వాత ఇండియాలో ఈ తరహా గుండెపోటు కేసులు ఎక్కువగా ఉండడం మనం గమనిస్తున్నాం.  ఈ ధోరణి చాలా ఆందోళన కలిగిస్తుంది. సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలు ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చదివి తెలుసుకుందాం..!
 

సైలెంట్ హార్ట్ ఎటాక్ వస్తే ఆ లక్షణాలను గుర్తించడం చాలా చాలా కష్టం . గుండెపోటు వస్తే ఆ లక్షణాలు ఈజీగా తెలిసిపోతాయి . అయితే సైలెంట్ హార్ట్ ఎటాక్ లో లక్షణాలు గుర్తించడం చాలా కష్టం . దీని వల్ల చికిత్స సరైన సమయానికి అందకపోవచ్చు.  హార్ట్ ఫెయిల్ అయ్యి స్పాట్లోనే మరణించొచ్చు . సైలెంట్ గా వచ్చే గుండె పోటులో ఎక్కువగా లక్షణాలు కనిపించకపోవచ్చు . కానీ కొన్ని లక్షణాలు మాత్రం కనిపించే అవకాశం ఉంది.  మరీ ముఖ్యంగా ఛాతి దగ్గర అసౌకర్యంగా అనిపించడం ..దవడ భాగంలో నొప్పి రావడం.. చేతులు పైకి ఎత్తలేకపోవడం..చేతిలో కాస్త అసౌకర్యం గా అనిపించడం . అలసిపోయినట్లు ఉండడం.  కళ్ళు తిరగడం ఓపిక లేకుండా కుప్ప కూలిపోయినట్లు ఉండడం . ఊపిరి తీసుకోవడంలో సమస్యలు.  బాడీ అంతా చల్లని చెమటలు పట్టేస్తూ ఉండడం. సైలెంట్ హార్ట్ ఎటాక్ కి లక్షణాలు.

 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే..

సైలెంట్ హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలి అనుకుంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మరీ ముఖ్యంగా వాకింగ్ ..కనీసం 20 నిమిషాలైనా రోజుకి వాకింగ్ చేస్తూ ఉండాలి. డీప్ ఫ్రై ఐటమ్స్ ..జంక్ ఫుడ్స్ పూర్తిగా మానేయాలి . రెగ్యులర్గా వ్యాయామం చేస్తూ ఉండాలి. బీపీ - షుగర్ - కొలెస్ట్రాలు కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి . ఒత్తిడిని తగ్గించుకుంటే ఇంకా ఇంకా మంచిది. స్మోకింగ్ డ్రింకింగ్ లాంటి హ్యాబిట్స్ పూర్తిగా మానేస్తే బెటర్.  హెల్ది లైఫ్ స్టైల్ ని ఫాలో అయితే ఎటువంటి రోగం రాదు అని గుర్తుంచుకోవాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: