మాతృత్వం అనేది ప్రతి అమ్మాయికి ఒక అద్భుతమైన అనుభూతి..అలాంటి మాతృత్వానికి మాయని మచ్చ తెచ్చారు.. పిల్లలు పుట్టాలని ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఎంతో మంది డాక్టర్లను కలిసినా కూడా పిల్లలు కాకపోతే చివరికి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా నైనా పిల్లల్ని కనాలి అనుకుంటారు. అలా అనుకున్న ఓ జంట సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కి వెళ్లి బిడ్డని కన్నారు.కానీ తీరా ఆ బిడ్డ మాటిమాటికి జబ్బు పడుతున్నాడు అని తెలిసి టెస్ట్లు చేయించగా డిఎన్ఏ తల్లిదండ్రులది కాదు అని తేలడంతో సృష్టి హాస్పిటల్స్ అసలు రూపం బయటపడింది.

సృష్టి నిర్వహకుల మీద కేసు ఫైల్ చేసిన పోలీసులు ఇప్పటికే ఎన్నో సంచలన విషయాలు బయటకు లాగారు.. పిల్లల కోసం వచ్చిన జంటకి భర్త వీర్యం కాకుండా మరొకరి వీర్యం ఇచ్చారు. ఇక్కడితోనే వీరి ఆగడాలు ముగిసిపోలేదు. వీరి గురించి మరిన్ని విషయాలు బయటపడ్డాయి. సరోగసీ పేరు మీద పేద వాళ్ళ దగ్గర తక్కువ డబ్బులకు పిల్లల్ని కొని లక్షలు పెట్టి ఆ పిల్లల్ని ధనవంతులకు అమ్మేశారు. అయితే తాజాగా మరొక సంచలన విషయం బయటపడింది. అదేంటంటే సికింద్రాబాద్ ఫుట్ పాత్ దగ్గర ఉండే చాలామంది బిచ్చగాళ్ళను ఈ సృష్టి నిర్వాహకులు తమ సెంటర్ కి తీసుకువెళ్లి వాళ్లకు బీరు, బిర్యానీ ఆశ చూపి పోర్న్ వీడియోలు చూపిస్తూ వారి ద్వారా వీర్యం సేకరించినట్టు పోలీసుల విచారణలో తేలింది. 

మరోవైపు మహిళల నుండి అండం  సేకరణ కోసం పేద మహిళలను లక్ష్యంగా చేసుకొని వారికి డబ్బు ఆశ చూపి అండం ఇస్తే 10 నుండి 25 వేల వరకు మహిళలకు ఇచ్చారు. ఇక పురుషులకు వీర్యం ఇచ్చినందుకు 800 నుండి 4000 వరకు డబ్బులు ఇచ్చారట. ఇలా దొడ్డి దారిన అండాలు, వీర్యం సేకరిస్తూ ఎక్కువ రేటు కి అహ్మదాబాద్ కి అమ్మేసినట్టు తెలుస్తోంది. ఇలా సృష్టి టెస్టు బేబీ సెంటర్ వాళ్ళ గురించి తవ్వే కొద్ది నిజాలు బయటపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: