ముఖ్య సంఘటనలు..
1857: జపాన్ లోని టోక్యోలో భయంకర భూకంపం – 100,000 మంది మృతి.
1990 : దక్షిణాఫ్రికా పాలనలో 75 సంవత్సరములు గల నమీబియాకు స్వాతంత్ర్యం.
ప్రముఖుల జననాలు..
1768: జోసెఫ్ ఫోరియర్, ఫ్రాన్స్ కు చెందిన గణిత, భౌతిక శాస్త్రవేత్త. (మ.1760)
1915: మేకా రంగయ్య అప్పారావు, నూజివీడు జమిందారీ కుటుంబానికి చెందిన వారు విద్యావేత్త, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభసభ్యుడు
1916: ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, సెహనాయి విద్వాంసుడు. (మ.2006)
1923: "సహజ రాజయోగ" సంస్థ ప్రారంభకురాలైన భారత మహిళ మాతాజీ నిర్మళా దేవి లేదా నిర్మల శ్రీవాస్తవ (మరణం:2011)
1925: మునిపల్లె రాజు, భారత ప్రభుత్వ రక్షణ శాఖలోని ఇంజనీరింగు సర్వీసులో ఉద్యోగం చేసాడు, తెలుగు కథను సుసంపన్నం చేసారు
1942: పచ్చా రామచంద్రరావు, లోహ శాస్త్రజ్ఞుడు
1978: భారత సినీనటి రాణీ ముఖర్జీ.ఎన్నో సినిమాలకు ఫిలింఫేర్ వంటి ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు అందుకున్నారు ఆమె. ఇప్పటికి ఏడు ఫిలింఫేర్ పురస్కారాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు.భారతీయ సినీరంగంలోని ప్రముఖ ముఖర్జీ-సమర్థ్ కుటుంబానికి చెందిన రాణీ ముందు సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. ఆమె చిన్నతనంలో తన తండ్రి తీసిన బెంగాలీ చిత్రం బియర్ ఫూల్ (1996) లో సహాయ నటిగా కనిపించారామె. 1997లో రాజా కీ ఆయేగీ బారాత్ సినిమాలో తల్లి కోరిక మేరకు హీరోయిన్ గా నటించారు రాణీ. ఇక సినిమారంగంలో కొనసాగేందుకు నిర్ణయించుకున్న ఆమెకు కుచ్ కుచ్ హోతా హై
ప్రముఖుల మరణాలు
తుమ్మల సీతారామమూర్తి
1942: కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకటరమణ కవి, అవధానంలో పేరొందిన జంట సోదర కవులు. (జ.1887)
1972: పప్పూరు రామాచార్యులు, తెలుగు కవి,మాజీశాసనసభ్యుడు. (జ.1896)
1990: తుమ్మల సీతారామమూర్తి, ఆధునిక పద్యకవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు. (జ.1901)
2013: చినువ అచెబె, ఆధునిక ఆఫ్రికన్ సాహిత్య పితామహుడు. (జ.1930)
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి