సంక్రాంతి సమయంలో మాత్రమే కనిపించే అతి పురాతన కళాకారులు గంగిరెద్దులవారు. వారు గంగిరెద్దులతో చేయించే విన్యాసాలు  అందరినీ ఆకట్టుకుంటాయి. వీటితో పాటుగా తెల్లవారుజామునే అంబ పలుకు జగదాంబ పలుకు అంటూ వచ్చే బుడబుక్కల వాళ్ళు, అలాగే రామ రామ అంటూ రామాయణ గానం పాడే తప్పెటగుళ్ళు వారు, శుభం శుభం అంటూ శంఖాన్ని పూరించుట జంగమదేవర వాళ్లు, వీరంతా మనకు సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ప్రతి ఊర్లో సందడి చేస్తూ ఉంటారు. అలంకరించిన గంగిరెద్దులతో వారి చేయించే విన్యాసాలు అందరినీ అబ్బురపరుస్తాయి.

ఇంటికి సాక్షాత్తూ నందీశ్వరుడు వచ్చినంత ఆనందపడి వారికి తోచిన సాయాన్ని అందిస్తారు. ఇంకా చాలామంది గంగిరెద్దులకు వస్త్ర దానం చేస్తారు. గంగిరెద్దుల గురించి పురాణకాలంలో జరిగిన ఒక కథ ఉంది అది ఏంటో తెలుసుకుందామా..? పూర్వం గజాసురుడు అను రాక్షసుడు శివుని అనుగ్రహం కోసం చాలాకాలం తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు అతని వరం కోరుకోమంటాడు. గజాసురుడు కోరిన వరం మేరకు శివుడు గజాసురుడు గర్భాన్ని నివాసం చేసుకోమని కోరతాడు. దీంతో శివుడు  ఎంతకాలమైనా కైలాసానికి పోకపోవడంతో పార్వతీదేవి కలవరపడింది. ఇదే విషయాన్ని విష్ణువుతో మొరపెట్టుకోగా, దీంతో శివుడు ఎక్కడున్నాడో తెలుసుకున్నాడు శ్రీమహావిష్ణువు. దీంతో వెంటనే విష్ణువు బ్రహ్మ ఇతర దేవతలు సన్నాయి డోలు ఇతర వాయిద్యాలు వాయించే కళాకారులుగా మారి శివుని వాహనమైన నంది ఈశ్వరున్ని చక్కగా అలంకరించి గజాసురుని నగరానికి వెళ్లి ఆట మొదలు పెట్టారు. వీరి అద్భుత నైపుణ్యాన్ని విన్న గజాసురుడు వారిని పిలిపించి తన ఎదుట గంగిరెద్దుల ఆట ఆడించాలన్నాడు.

దీంతో వీరు ఆటను అద్భుతంగా ప్రదర్శించారు. దీంతో ఏం కావాలో కోరుకోమన్నారు గజాసురుడు. ఈ గంగిరెద్దు నందీశ్వరుడు తన యజమాని శంకరుని కోసం వచ్చారు. శివున్ని ఇవ్వాలి అని కోరాడు. వచ్చిన వారు శ్రీ మహా విష్ణువు, బ్రహ్మ దేవతని గుర్తించి చేసేది ఏమీ లేక వెంటనే నంది తన వాడి అయిన కొమ్ములతో  గజాసురుని పొట్టలో గట్టిగా పొడిచి శివుడిని బయటకు రప్పించింది. అందుకే గంగిరెద్దులకు ఇంతటి చరిత్ర ఉందని  వీరికి ఏ మాత్రం దానం చేసిన మనకు ఎంతో మంచి జరుగుతుందని చరిత్ర చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: