
కానీ ఇప్పుడు ఆ అనుమానాలన్నింటికీ ముగింపు పలుకుతూ, అభిమానుల హృదయాల్లో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చేలా ఒక సెన్సేషనల్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం, సమంత త్వరలోనే మళ్లీ ఓ భారీ తెలుగు సినిమాలో నటించబోతోందట.ఆ సినిమా మరెవరిదీ కాదు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కబోతున్న ఒక అట్లీ భారీ ప్రాజెక్ట్. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట దీపికా పదుకోనె ని తీసుకున్నారు. కానీ "కల్కి 2" మూవీ విషయంలో ఏర్పడిన కొన్ని అనుకోని సమస్యలు, వ్యక్తిగత కారణాల వల్ల దీపికా పేరు లిస్టులో నుంచి తొలగించబడింది. అదే సమస్యలు ఈ సినిమాకి కూడా ఇబ్బందిగా మారడంతో, మేకర్స్ వెంటనే మరో ఆప్షన్ కోసం వెతకడం ప్రారంభించారు.
అప్పుడు ముందుకు వచ్చిన పేరు సమంతదే! ఇప్పటికే నిర్మాతలు, డైరెక్టర్ సమంతతో చర్చలు జరిపారని, ఆమె కూడా ఈ ప్రాజెక్ట్‌కి "అవును" అన్నారని ఇండస్ట్రీ టాక్. అన్నీ సవ్యంగా జరిగితే చాలా త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రాబోతోందట.ఈ వార్త విన్న వెంటనే సమంత అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. "ఎన్నాళ్లుగా ఎదురు చూసిన క్షణం రాబోతోంది.. మళ్లీ మన సమంత తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తోంది!" అంటూ కామెంట్లు చేస్తున్నారు. సమంత లాంటి అగ్రనటి తిరిగి తెలుగు తెరపై కనిపిస్తే, ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా కనిపిస్తోంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి అధికారిక అప్డేట్ మీదే పడింది. ఇంతకీ నిజంగా సమంత – అల్లు అర్జున్ కాంబినేషన్ నిజమవుతుందా? లేక ఇది గాసిప్పేనా? అనేది చూడాలి మరి..!