వర్షాకాలం వచ్చిందంటే చాలు అందరికి ఉల్లాసంగా ఉంటుంది.వేసవి కాలం ఎండ  వేడిమికి అందరం  ఉక్కి పోయాము ఉంటాము కాబట్టి ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చి చల్లని గాలులతో మనల్ని పలకరించే వర్షాకాలం వచ్చిందంటే హాయిగా ఉంటుంది మరి.పిలల్లకు అయితే వర్షాకాలం అంటే భలే ఇష్టం.ఎదో ఒక సాకు చెప్పి ఎంచక్కా వర్షంలో తడుస్తూ గంతులు వేయొచ్చని చుస్తూ ఉంటారు. కానీ.. ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు మనల్ని నిద్రపోకుండా చేస్తాయి.మనతో పాటు పిల్లల్ని కూడా వదలవు.  ఈ కాలంలో పిల్లలు సరైన ఆహార పదార్థాలను తీసుకోకపోతే అనారోగ్యం పాలవుతారు.  పూర్తి ఆరోగ్యంగా ఉన్న  పిల్లలు కూడా  సీజనల్ వ్యాధుల బారిన పడి అనారోగ్యానికి గురవుతారు. ముఖ్యంగా ఈ వాతావరణంలో పిల్లల్ని మురుగు నీటికి, అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉంచాలి.

ప్రధానంగా బయటి ఆహారాన్ని పిల్లలకు పెట్టడం మానుకోని ఇంట్లో తయారు చేసిన వేడివేడి ఆహారాన్ని పెట్టాలి.పిజ్జా, పాస్తా, బర్గర్లు, ఫ్రైస్ ఇటువంటి ఫాస్ట్ ఫుడ్స్‌కి వీలైనంత దూరంగా పిల్లల్ని ఉంచడం మంచిది.వీటిలో ఎక్కువగా అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ఇంట్లో తయారు చేసుకోని తినడం వల్ల  సీజనల్ వ్యాధులను పిల్లల దరి చేరకుండా చేయవచ్చు.వర్షాకాలంలో పిల్లల్లో  రోగనిరోధక శక్తిని పెంచడంలో కొన్ని ఆహార పదార్ధాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అవేంటో చూద్దాం..!! ప్రతి సీజన్‌లో అల్లం-వెల్లుల్లి ఆరోగ్యవంతంగా ఉండటానికి ఔషధంలా పనిచేస్తాయి. వర్షాకాలంలో అల్లం వెల్లుల్లి తినడం వల్ల పిల్లలును సీజనల్ వ్యాధుల నుండి కాపాడుకోవచ్చు.

అయితే వెల్లుల్లి ముఖ్యంగా అంటువ్యాధులతో పోరాడటానికి సహకరిస్తుంది. నిమ్మకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిమ్మకాయల్లో ఉన్న ‘విటమిన్ సీ’  పిల్లలలో వచ్చే అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తూ కవచంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని కూడా అమితంగా పెంచుతుంది. అలాగే  పసుపును క్రమం తప్పకుండా ఆహారంలో,పాలతో తీసుకోవడం ద్వారా పిల్లల్లో  జ్ఞాపకశక్తి  మెరుగుపడటంతోపాటు.. మానసిక స్థితిని అదుపులో ఉండేలా చేస్తుంది. పసుపు వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పాలకూర, బచ్చలికూర లాంటి ఆకు కూరలు రోగనిరోధక శక్తిని ఇంప్రూవ్ చేయడానికి దోహదపడతాయి. ఆకు కూరలు తినడం వల్ల తరచూ అనారోగ్యానికి గురికాకుండా పిల్లల్ని  కాపాడుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: