చాల మందికి నిద్రలో కలవరించడం అలవాటుగా ఉంటుంది. ఈ అలవాటు పెద్దవాళ్లకే కాదు.. చిన్న పిల్లలకు కూడా ఉంటది. ఇక పిల్లలు నిద్ర పోతూ ఏ వేవో  కలవరిస్తుంటారు. నిద్రలో  ఇలా ఎందుకు చేస్తున్నారు గాలి, ధూళి ఏమైనా సోకిందా.. అంటూ పెద్దవాళ్ళు కంగారుపడుతూ  ఆలోచిస్తుంటారు. అంతేకాదు వారిని డాక్టర్ల దగ్గరికీ తీసుకువెళ్తుంటారు. అయితే, తల్లిదండ్రులు ఈ విషయం గురించి అస్సలు కంగారుపడాల్సిన పని లేదు.

అయితే పిల్లలు రోజంతా ఆడిన ఆటలు చేసిన పనులు, గురించి నిద్రలో కలవరిస్తుంటారు. నిద్రలో  వాళ్లకు ఇష్టమైనవి, గుర్తొచ్చినప్పుడు కూడా ఇలాగే చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల వారి చిన్ని చిన్ని మెదళ్ల లో ఉండే భారం తగ్గుతుంది. అయితే, ఈ కలవరింతలు మరీ ఎక్కువగా ఉంటే మాత్రం పక్కనే ఉండి దగ్గరగా తీసుకుని ఒళ్లో పడుకోబెట్టుకుని మృదువుగా వారిని జో కొట్టాలి. దీని వల్ల తల్లిదండ్రులు వారితో ఉన్నారనే  ధైర్యం పిల్లలకు కలుగుతుంది. ఇలా చేసినా కూడా కలవరింతలు ఆగి పరిస్థితి చక్క బడక పొతే మాత్రం డాక్టర్లని సంప్రదించడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇక ఒక్కొక్కసారి పిల్లలు రాత్రి పడుకునే ముందు సరిపడినంత ఆహారం తినకపోతే ఇక పిల్లలు నిద్రపోకుండా అటూ ఇటూ  కదులుతూ ఏడుస్తూనే ఉంటారు. పరిస్థితి అలా  ఉంటే ఆ తల్లులకు కూడా కంటి మీద కునుకు ఉండదు. కాబట్టి పిల్లలు నిద్ర పోయే ముందే  కడుపు నిండి ఉండేలా చూసుకోండి. టీవీ, మొబైల్ చూడడం తగ్గేలాచేయండి. వాటిలో భయంకరం గా ఉండేవి చూడకుండా జాగ్రత్త పడండి. పడుకునే ముందు పిల్లలు కచ్చితంగా స్నానం, భోజనం చేసి ఉండేలా చూడడం తో పాటు మీ దగ్గరగా తీసుకుని మంచి మంచి కథలు చెప్తూ వారిని ప్రేమగా నిమురుతూ పడుకో పెట్టడం  వలన కూడా మంచి ఫలితం ఉంటుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: