కొంత మంది పిల్లలు చాల హైపర్ యాక్టీవ్ తో ఉంటారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో హ్యాపీగా కూడా ఉంటారు. ‘మా వాడు చాలా యాక్టివ్. మా అమ్మాయి భలే చలాకీ’ అని అందరికి చెప్పుకుంటూ మురిసిపోతుంటారు. అయితే  కొంచెం వయస్సు వచ్చాక పిల్లలు తల్లిదండ్రులు ఎంత చెప్పిన వాళ్ళ మాట వినరు.  మీరు కూడా ప్రత్యక్షంగా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలతో వాటిని దూరం చేసుకోవచ్చు. కంగారు పడకూడదు. ‘నాకు తెలుసు. నాకేం చెప్పొద్దు’ అనేది మీ ఒక్కరి పిల్లలే కాదు. చాలా మందిలో అలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి, మొదట మీరు చేయాల్సింది కంగారు పడకుండా ఉండడం.

అయితే సంయమనం పాటించాలి. చిన్నప్పటి నుంచి పిల్లలకు కావాల్సినవన్నీ దగ్గరుండి చూసుకునే బొమ్మరిల్లు అమ్మానాన్నలకు ఈ మాటలు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తాయి. కానీ, తల్లిదండ్రులే ఈ విషయంలో కొంచెం సంయమనంతో వ్యవహరించాలి. ఒక నిర్ణయం వల్ల ఎదురయ్యే పర్యవసానాలు చెప్పాలి. పిల్లలు ఏదైనా ఒక దుందుడుకు నిర్ణయాలు, ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటున్నారని అనిపిస్తే వెంటనే వారిని కూర్చోబెట్టి వారికి ఓ నిర్ణయం తీసుకోవడానికి ఆలోచించాల్సిన అంశాలు, ఆ నిర్నయం తీసుకుంటే ఎదురయ్యే పర్యవసానాలు అన్నీ 360 డిగ్రీల కోణంలో ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోమని అర్థం అయ్యేలా చెప్పాలి.

ఇక వాళ్లేం పసిపిల్లలు కాదు. 15, 16 ఏళ్ల వయసు వచ్చిన వాళ్లు మరీ పసిపిల్లలు కాదన్న విషయాన్ని పెద్దలు గ్రహించాలి. ఒకే విషయాన్ని పదే పదే చెప్పకూడదు. అలా చేస్తే ‘రోజూ ఇదే సుత్తి’ అనుకుంటారు. మీ దగ్గర కంటే బయట ఎక్కువ టైం గడపడానికి ఇష్టపడతారు. దాంతో మరిన్ని కొత్త సమస్యలు రావొచ్చు. ఇవన్నీ కొన్ని పరిష్కార మార్గాలు మాత్రమే. వ్యక్తికి, వ్యక్తికి మధ్య సమస్యలు భిన్నంగా ఉండొచ్చు. అలాంటిది ఏదైనా కనిపిస్తే, ఇది సాధారణం కాదు. అసాధారణంగా అనిపిస్తుందని అనిపిస్తే పిల్లలను డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్లడంలో తప్పేం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: