చికెన్‌,మటన్‌,పోర్క్‌... ఏ మాంసాహారం అయినా సరే.. రోజూ తినవచ్చా..? తింటే ఏమవుతుంది..? దీనికి వైద్యులు ఎలాంటి సమాధానం చెబుతున్నారు..? ఏ మాంసాహారంలోనైనా ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు ఉంటాయి. అయితే మటన్‌లో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. చేపలు, రొయ్యల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.

ఈ క్రమంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే మాంసాహారాలను అధికంగా తింటే శరీరంలో ఎల్‌డీఎల్‌ (చెడు కొలెస్ట్రాల్‌), ట్రై గ్లిజరైడ్లు చేరతాయి. దీనివల్ల బరువు పెరుగుతారు. అలాగే గుండె సంబంద వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందుకని కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే మాంసాహారాలను తక్కువగా తినాలి. పందిమాంసంలో కొవ్వు అధికంగా ఉంటుంది, అది తినడం మరింత హాని. ఈ క్రమంలోనే నిత్యం ఏ మాంసాహారం అయినా సరే.. అందులో కొవ్వు తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

మన శరీరానికి నిత్యం కావల్సిన కొవ్వు పదార్థాల మోతాదు మించకుండా మాంసాహారాలను తినాలి. ఇలా తింటే రోజూ మాంసాహారం తిన్నా ఎలాంటి దుష్పరిణామాలు కలగవు. అందుకే మటన్‌,చికెన్‌ వదిలి, గుడ్లు, చేపలను రోజూ తినవచ్చు. కాకపోతే మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

శరీరానికి ప్రోటీన్లు లభించి కణజాల నిర్మాణం జరుగుతుంది. రోజూ నాన్‌ వెజ్‌ తినేవారికి వైద్యులు ఒక విలువైన సూచన చేస్తున్నారు. రోజుకో బిర్యానీ తిన్నా పర్వాలేదు. కానీ ఉదయమే గంట ఖచ్చితంగా వాకింగ్‌ చేయాలి అంటున్నారు. నిత్యం వాకింగ్‌ చేయగలిగితే ఏది తిన్నా ఆరోగ్యానికి ఢోకా లేదంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: