సాధార‌ణంగా గ‌ర్భిణీలు ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌస్టికాహారము అనగా ఎక్కువపాలు, పండ్లు, ఆకుకూరలు, పప్పు, మాంసము, చేపలు వగైరా తీసుకోవాలి. అయితే ప్ర‌స్తుత రోజుల్లో గర్భం దాల్చడం, పిల్లల్ని కనడం సమస్యగా మారుతున్నది.  జీవనశైలి మార్పులవల్ల ప్రకృతి ధర్మాలు వికటిస్తున్నాయి. గర్భిణీలు ప్రత్యే కమైనటువంటి వ్యాయామాలు, యోగ సాధనలు చేసినట్లయితే, సీజెరియన్‌ బాధ లేకుండా సహజ ప్రసవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


అలాగే తేలికైన వ్యాయామాలు, వాకింగ్‌, యోగ, ధ్యానం సాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే మానసిక సమస్యలు తగ్గడానికి, సుఖ ప్రసవం జరగడానికి యోగా ఎలా ఉపయోగపడుతుందన్న సంశయం ఉంది. ప్రత్యేకమైన వ్యాయామాలు, ప్రాణాయామాలు, వజ్రాసనం ఇలా కొన్ని సులభమైన ఆసనాలు వేయాడం ద్వారా అంతే కాదు తల్లి గర్భంలో ఉన్న బిడ్డకు అన్ని అవయవాలు సక్రమంగా పెరుగుతాయి, బిడ్డ చాలా యాక్టీవ్‌గా ఉంటాడు.


గర్భిణీ స్త్రీలు సింపుల్ గా యోగా సాధన చేయడం వల్ల కొన్ని ఎఫెక్టివ్ ప్రయోజనాలను పొందవచ్చు. గర్భధారణ నుంచి, ప్రసవం, ప్రసవానంతరం అవసరమైన యోగాసనాలు నేర్పించి సాథన చేయిస్తున్నారు. డాక్టర్ల సలహా మేరకు ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ, యోగసనాలు సాధన చేస్తే తప్పకుండా సుఖప్రసవాలు జరుగుతాయని చాలా అధ్యయనాలు, పరిశోధనలు వెల్లడించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: