సాధార‌ణంగా బాగా అల‌సిపోయిన‌ప్పుడు, ఎక్కువ సేపు నిల‌బ‌డ‌డం, బాగా న‌డ‌వడం వ‌ల్ల ఒక్కోసారి విప‌రీతంగా కాళ్ల నొప్పులు వ‌స్తుంటాయి. లేదంటే పోష‌కాహార లోపం కూడా కాళ్ల నొప్పి వ‌చ్చేందుకు కార‌ణం అవుతూ ఉంటుంది. అయితే ఎలా వ‌చ్చినా కాళ్ల నొప్పితో మ‌న‌కు ఇబ్బందే క‌లుగుతుంది.  ఆ నొప్పులకు కారణాలు ఎన్నైనప్పటికీ వాటిని నుంచి ఉపశమనం పొందడానికి అందరూ తంటాలుపడుతుంటారు. ఈ క్ర‌మంలోనే నొప్పుల‌ను త‌ట్టుకోలేక పెయిన్ కిల్ల‌ర్స్ కూడా వాడుతుంటారు. కానీ ఇది అంత మంచిది కాదు. ఎప్పుడూ కూడా స‌హ‌జ సిద్ధంగానే నొప్పుల‌ను త‌గ్గించుకోవాలి. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


-  ఐస్ ముక్క‌ల‌ను మ‌రింత చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయాలి. వాటిని ఒక ప్లాస్టిక్ క‌వ‌ర్‌లో ఉంచి ముడి వేయాలి. దీన్ని నొప్పి ఉన్న ప్రాంతంలో మ‌సాజ్ చేయాలి ఇలా చేయ‌డం వ‌ల్ల‌ కాళ్ల నొప్పులు త‌గ్గుతాయి.


-  గోరువెచ్చని నువ్వుల నూనెలో కొద్దిగా పసుపు వేసి పేస్ట్ లా చేసి కాళ్ల‌కు అప్లై చేసి మర్దన చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.


- కీళ్ల‌నొప్పులు, కండ‌రాల నొప్పుల‌కు ల‌వంగం నూనె చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. ఈ నూనెతో మ‌సాజ్ చేయ‌డం వ‌ల్ల నొప్పులు త్వ‌ర‌గా త‌గ్గుతాయి.


- ఒక కప్పు చెర్రీపండ్లను ప్రతిరోజూ తీసుకుంటే కాళ్ల నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. చెర్రీ పండ్లలో ఆంథోసయనిన్లు అనే శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. నొప్పిని తగ్గించడానికి ఇవి గ్రేట్‌గా ప‌ని చేస్తాయి.


- ఒక బకెట్ లో వేడినీటిని తీసుకొని కొద్దిగా వెనిగర్‌ను, ఎప్సం సాల్ట్ ను మిక్స్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో దాదాపు 20 నిమిషాల పాటూ కాళ్ళను నానబెట్టాలి. ఇలా చేయటం వలన కాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు.



మరింత సమాచారం తెలుసుకోండి: