ఈ కాలంలో పెళ్ళైతే.. అన్నాతమ్ముళ్ల బంధాలే సరిగ్గా లేవు.. వీళ్ళు ఒకేసారి వదిన మరిది బంధాల గురించి రాయమని అడుగుతారు. ఎందుకయ్యా ఇలా చెప్పండి ? వదినమ్మ సీరియల్ లో తప్ప వదిన మరిదిలు అమ్మ కొడుకులు అనుబంధంతో మరెక్కడా అలాంటి వండిన మరిది బంధం మనం చూసి ఉండం. అలాంటి కాలం ఇది.
ఇప్పుడు మరి వింతగా ఈ నాటి కాలంలో కుటుంబాలు ఇలా ఉంటాయి అనుకోవడం చిత్రం.. విచిత్రం. ఎందుకంటే ఏ అన్న భార్యకు ఈ కాలంలో ఈ మరిది మర్యాద ఇవ్వడం లేదు.. ఒకవేళ ఇచ్చిన అది వందమందిలో ఒక్కరు ఇచ్చి ఉంటారు. అలాంటి కాలం ఇది. అలాంటి విలువులు ఇచ్చే కాలం అంతరించిపోయింది.
ఎందుకు అనేది కచ్చితంగా చెప్పలేం కానీ.. పాతకాలం మాత్రం కాదు ఇది. పాతకాలంలో అయితే.. ఒకరికి నలుగురు నుండి ఐదుగురు కొడుకులు ఉండేవారు.. వాళ్లలో మొదటి కొడుకుకు పెళ్లి అవ్వగానే.. ఆ పెద్ద కోడలు నాలుగు మరిదులకు అమ్మ అయ్యేది. వదినమ్మ అయ్యేది. నలుగురిని తల్లిలా చూసుకునేది.. ఆ నలుగురు కూడా ఆమెను వదినమ్మ అని ప్రేమగా పిలిచేవారు. అలా ఆ అనుబంధం ఉండేది. ఇప్పుడు అంతలేదు లెండి. అసలు ఆ అనుబంధాలే లేవు.. ఎవరికీ వారే యమునాతీరే అన్నట్టు ఆ అనుబంధాలు ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి