నేడు చాలామంది జంటలు ఒకేమారు ఇద్దరు పిల్లలను అంటే కవల పిల్లలను కనేయాలని కోరుకుంటుంటారు. అయితే ఎల్లపుడు బిజీగా వుంటూ పనులు చేసుకునే మహిళలకు ఒకే సారి కవలలు కలగటం నిజంగా అదృష్టం అని చెప్పుకోవాలి. ఇక ఇద్దరుపిల్లలు ఒకేసారి పుడితే ఆకన్న తల్లిదండ్రుల ఆనందం రెండింతలుగా మారుతుంది. గర్భంతో ఉన్నప్పుడు కొన్ని లక్షణాలను బట్టి మీకు  మగబిడ్డ పుడతాడా? ఆడపిల్ల పుడుతుందా అని చాలామంది చెప్పే ఉంటారు. 

 

అయితే మీకు కవల పిల్లలు పుట్టబోతున్నారు అని తెలిపే గుర్తులు కూడా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రెగ్నన్సీ సమయంలో సాధారణంగా అలసట ఉండటం సహజమే కానీ గర్భంలో ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు కాస్త ఎక్కువ అలసట ఉంటుంది. ఎంత శక్తివంతమైన ఆహారం తీసుకున్నా త్వరగా నీరసం వచ్చి అలసిపోతుంటారు. సాధారణంగా ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు ఒక బిడ్డను కడుపులో మోస్తున్నప్పుడు మాములు బరువు కలిగి ఉంటారు. అయితే కవల పిల్లలు పుట్టబోతున్నారు అని చెప్పడానికి రోజురోజుకీ అధిక బరువు పెరుగుతూ ఉండటం, గర్భం కూడా ఎక్కువ సైజులో ఉండటం జరుగుతుంది. 

 

కవల పిల్లలు పుట్టబోయే లక్షణాలు ఉన్నపుడు మహిళలలో వికారం ఎక్కువగా ఉంటుంది. ఎన్ని నెలలు ఇలా ఉంటుంది అనేది చెప్పలేరు గాని విప‌రీతంగా వికారం ఉంటుంది.ఐరన్ లోపం మరియు రక్తహీనత లక్షణాలు మీ గర్భంలో ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు ఎక్కువ రక్తసరఫరా ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందడానికి ఎక్కువ ఒత్తిడి జరుగుతుంది. దీని వలన శ్వాసలో మార్పులు, అలసట, తలనొప్పి, హృదయ స్పందనలలో మార్పులు, మైకం కమ్మినట్లు ఉండటమే జరుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: