మష్రూమ్ అంటే అందరికీ ఇష్టమే.. ఎందుకంటే ఆ రుచి అలాంటిది మరి. నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ మష్రూమ్స్ ను ఎక్కువగా తీసుకుంటారు.. అయితే రోజు చేసే విధంగా కాకుండా మష్రూమ్స్ లో వెరైటీ గా చేసుకోవాలని అంటుంటారు.. అయితే వాళ్ళు ఇంట్లోనే కొత్తగా ఉండేలా మష్రూమ్ సూప్ ను ట్రై చేయడం మేలు.. చాలా హెల్తీ మరియు చాలా టేస్టీ గా ఉంటుంది. ఈ సూప్ ను ఇంట్లోనే చాలా సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. 



మష్రూమ్ సూప్ కు కావలసిన పదార్థాలు.. 


బటన్ మష్రూమ్స్ - 200 గ్రాములు

బటర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, 

కొత్తిమీర తరుగు - అరకప్పు, 

క్రీమ్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, 

నిమ్మరసం - అర చెక్క, 

కార్న్‌ఫ్లోర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, 

ఉప్పు - రుచికి సరిపడా, 

మిరియాల పొడి - పావు టీ స్పూను, 

అల్లం పేస్టు - అర టీ స్పూను

మిర్చి పొడి - కొద్దిగా 


తయారీ విధానం ..


ముందుగా మష్రూమ్స్ ను బాగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి..తర్వాత మష్రూమ్స్ ను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో బటర్‌ కాగిన తర్వాత అల్లం పేస్టు వేగించి మష్రూమ్స్‌ తరుగు, ఉప్పు, మిరియాల పొడి కలిపి మూతపెట్టి 5 నిమిషాలు మగ్గించాలి. తర్వాత స్టవ్‌ ఆపేసి, ముప్పావు వంతు మష్రూమ్స్‌ మిక్సీలో వేసి పేస్టు చేయాలి. పేస్టుని అదే కడాయిలో వేసి మూడు కప్పుల నీరుపోసి మరిగించాలి.అరకప్పు నీటిలో కరిగించిన కార్న్‌ఫ్లోర్‌ మరిగే మిశ్రమంలో కలిపి చిక్కబడ్డాక క్రీమ్‌ వేసి, నిమ్మరసం పోసి, కొత్తిమీర, పెద్ద మిర్చి పౌడర్ వేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ గా ఉంటుంది.. ఇలా చేయడం వల్ల చిన్న పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: