నిమ్మకాయ రంగు అంటే చాలా ఇష్టం ..ఇకపోతే రుచికి పుల్లగా ఉన్న ఈ నిమ్మను చూస్తే ఎవరికైనా నీళ్లు ఊరిపోవాల్సిందే.. అలాంటి నిమ్మకాయను బిరియాని నుంచి సలాడ్ వరకు అన్నిట్లో వాడతారు.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు వైద్య నిపుణులు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..పుల్లగా ఉన్న ఈ నిమ్మ వల్ల  శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తోంది.. ఎన్నో అధ్యయనాలు నిమ్మ పై పరిశోధనలు జరిపి ఎన్నో ఆరోగ్య సూత్రాలను తెలిపారు.




శరీరంలో పేరుకు పోయిన అధిక కొవ్వును నిమ్మ ఇట్లే కరిగిస్తుంది..అధిక బరువుతో బాధ పడే వారు నిమ్మరసం తాగితే రక్తసరఫరా మెరుగుపడటంతో పాటు గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి. మధుమేహంతో బాధ పడే వాళ్లు నిమ్మరసం తాగితే షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి. మానవ శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను ఈ నిమ్మరసం ఇట్లే తొలగిస్తుంది.. కడుపులో తిప్పడం లేదా షుగర్, బిపి లెవెల్స్ తగ్గినప్పుడు కాసింత నిమ్మరసం తీసుకుంటే వెంటనే ఉపశమనం పొందవచ్చు.శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది.. ఇకపోతే చర్మ రక్షణకు కావలసిన విటమిన్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి.. సి విటమిన్ తో పాటుగా మరి కొన్ని నిమ్మలో ఉంటాయి.. అందుకే నిమ్మ జాతి కాయలు అన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. 




రోజూ నిమ్మరసం తాగితే మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. వయస్సు పెరిగినా ముడతలు పడకుండా చేయడంలో నిమ్మరసం సహాయపడుతుంది. కలుషిత నీరు తాగి అనారోగ్యం బారిన పడితే నిమ్మరసం తాగితే ఉపశమనం కలుగుతుంది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ చిన్న చిన్న రాళ్లను కరిగిస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉండటం వల్లే వైద్యులు నిమ్మరసం తాగాలని సూచిస్తూ ఉంటారు. కడుపులో మంట, మొదలగు జీర్ణాశయానికి సంబందించిన సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే రోజులో ఒకసారి కాసింత నిమ్మరసం తీసుకుంటే మంచిదని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: