మన శారీరక సౌందర్యం ఎంత ముఖ్యమో, మన ఇల్లు కూడా అంతే శుభ్రంగా, సువాసనభరితంగా   ఉండటం  అంతే ముఖ్యం. మన ఇల్లు అందంగా, ఆహ్లాదకరంగా, శుభ్రంగా ఉంటే మానసిక ప్రశాంతత కలిగి మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఇంకా ఇంట్లో దోమలు, బల్లులు, బొద్దింకలు వంటివి చేరి చికాకు తెప్పిస్తాయి వాటి నుంచి రక్షణ పొందడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

ఇంట్లో చెడు వాసన వస్తుంటే పావు కప్పు బేకింగ్ సోడా లో టేబుల్ స్పూన్ వెనిగర్‌, రెండు చుక్కల లావెండర్‌ ఆయిల్  కలిపి మెత్తని ఉండల్లా చేసి ఒక పేపర్లో చుట్టి గది మూలల్లో పెడితే అవి దుర్వాసనను పిలుచుకొని మంచి సువాసన కలిగిస్తాయి.

గదిని శుభ్రం చేసేటప్పుడు ఆ నీటిలో పన్నీరు ను కలిపి శుభ్రం చేస్తే గది సువాసనలు వెదజల్లుతుంది.

ఫ్రిజ్ ను శుభ్రం చేసుకునే టప్పుడు వెనిగర్ కలిపిన నీటితో శుభ్రం చేస్తే ఫ్రిజ్ లోని బ్యాక్టీరియా వైరస్లు నశించి ఫ్రిజ్ చెడు వాసన రాకుండా ఉంటుంది.

రాత్రి పడుకునేటప్పుడు నిమ్మ నూనె, రెండు చుక్కల వేప నూనె కలిపి దీపం వెలిగిస్తే బెడ్ రూమ్ సువాసనతో నుండి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇంకా ఇంట్లో కి దోమలు రాకుండా కూడా రక్షణ పొందవచ్చు

ఇంట్లో బొద్దింకల తో సతమతం అవుతున్నారా అయితే బోరిక్ యాసిడ్ ను చిన్న కప్పులో నుంచి వంట గది మూలల్లో ఉంచితే బొద్దింకలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.

 పప్పులు ఇతర ఆహార దినుసులను నిల్వ చేసే డబ్బాలను బేకింగ్ సోడా కలిపిన నీటితో శుభ్రం చేస్తే జిడ్డుతోపాటు అప్పటి వరకు నిల్వ చేసిన పదార్థాల వాసనలు కూడా వదులు తాయి
వంట గదిలో కిచెన్ ప్లాట్ ఫామ్ ను వెనిగర్, ఉప్పు చల్లి కొద్దిసేపటి తర్వాత తుడిస్తే బ్యాక్టీరియా పూర్తిగా నశించి ఆరోగ్య వంతమైన వంటగది సిద్ధమవుతుంది.

ఇంట్లో అప్పుడప్పుడు సామ్రాణి పొగ వేస్తే దోమలను నిర్మించడమే కాకుండా డా మన ఇంట్లోని చెడువాసన కూడా తొలగిస్తుంది.

ఈ చిట్కాలు పాటించడం వల్ల మన ఇంట్లో దొరికే వాటితోనే మన ఇంటిని అందంగా శుభ్రంగా సువాసనభరితంగా ఉంచుకోవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: