అయితే, ఆవు పాలను తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని నిపుణులు అంటున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం.. వీటిని ఎక్కువగా తాగడం వల్ల ఎముకలు దెబ్బతింటాయని పరిశోధకులు తేల్చారు. దీనికి సంబంధించిన అధ్యయనాన్ని BMJ జర్నల్ లో ప్రచురించారు. ప్రతిరోజూ మూడు లేదా అంతకంటే ఎక్కువ గ్లాసుల పాలు తాగడం వల్ల మహిళల్లో ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతుందని కనుగొన్నారు.
ఎముకల బలోపేతానికి తోడ్పడే కాల్షియం పాల నుంచి ఎక్కువగా లభిస్తుంది. కానీ 8 ఔన్సుల ఆవు పాల నుంచి ఎముకల ఆరోగ్యానికి అవసరమయ్యే కాల్షియం లో 30 శాతం అందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆవు పాల లో మెగ్నీషియం, పొటాషియం కూడా ఉంటాయి. ఇవన్నీ ఎముకల తో పాటు దంతాల ఆరోగ్యానికి కూడా కృషి చేస్తాయి. కానీ జున్ను, కొవ్వుశాతం ఎక్కువగా ఉండే ఆవుపాలు వంటి డైరీ ఉత్పత్తుల్లో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి శరీరం లో మంట, వాపును పెంచుతాయి. ఇవి శరీరం లో చెడు కొలెస్ట్రాల్ ను, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయని పరిశోధకులు తేల్చారు... ఏదైనా లిమిట్ లో తీసుకుంటే మరీ మంచిది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి