శృంగారం అనేది కేవలం కోరిక తీర్చి సంతృప్తినిచ్చేది మాత్రమే కాదు. చాలా రకాల ప్రయోజనాలు కలిగిస్తుంది. చాలా మంది శృంగారం అనగానే ఇద్దరు వ్యక్తులు కలిసి కాసేపు శారీరకంగా తృప్తి పొందడమే అనుకుంటారు.



కానీ ప్రతి రోజు సెక్స్ చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ఉపయెగాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకోవాలని ఉందా!  అయితే పదండి



రోగనిరోధక శక్తిని పెంచుతుంది - మూత్రాశయ నియంత్రణ పెరుగుతుంది- బీపీ తగ్గుతుంది


వ్యాయామంలా పనిచేస్తుంది - గుండె జబ్బుల్ని తగ్గిస్తుంది - ఉద్వేగాన్ని పెంచుతుంది - పొస్ట్రేట్ క్యాన్సర్ తగ్గిస్తుంది- 


హాయిగానిద్ర పుచ్చుతుంది -  శారీరక, మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది - అదనంగా లభించే ప్రయోజనాలు



తెలివితేటలు వృద్ధి చెందటం - జ్ఞాపక శక్తి పెరగటం



*మూత్రం ఆపుకోలేని పరిస్థితి నుంచి బయటపడేందుకు బలమైన కటి అంతస్థు అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా మహిళలు పరిస్థితుల కారణంగా చాలా సేపు మూత్రం నియంత్రించుకోవాల్సి వస్తుంది. అయితే రోజు సెక్స్ చేయడం అనేది మూత్రాశయ కండరాలకు వ్యాయామంలా మారి కటి అంతస్థు బలంగా తయారవుతుంది.



*శృంగారానికి బ్లడ్ ప్రెజర్ కు చాలా దగ్గరి సంబంధం ఉంటుందట. ఎక్కువ సేపు సెక్స్ చేయడం వల్ల బీపీ తగ్గుతుందని చాలా స్టడీల్లో తేలిందట.



*శృంగారం అనేది ఓ రకమైన వ్యాయామం. నిమిషానికి 5 క్యాలరీలను కరింగించే శక్తి సెక్స్ కు ఉంటుంది. ఇది హృదయ స్పందన రేటును పెంచడమే కాక.. మీ కండరాలకు వ్యాయామంలా పనిచేస్తుంది.



*శృంగార జీవితాన్ని తృప్తిగా గడిపే వారు గుండె జబ్బులకు దూరంగా ఉంటారు. సెక్స్ మీ హార్ట్ రేట్ పెంచడమే కాక, మీ ఈస్ట్రోజెన్, టెస్టోస్టిరోన్ స్థాయిలను బ్యాలన్స్ చేస్తుంది. వీటిలో ఏది తగ్గినా ఓస్టియెపొరొసిస్, గుండె జబ్బు లాంటి రకరకాల సమస్యలు వస్తుంటాయి. కాబట్టి వారానికి రెండు లేదా మూడు సార్లైనా సెక్స్ చేస్తే గుండెను కాపాడుకున్నవారవుతారు.



*కాళ్ల నొప్పులు, నడుము నొప్పి లాంటివి రాగానే వెంటనే ఆస్పిరిన్ లాంటి మాత్రల కోసం వెతుకుతుంటారు. దీనికి బదులు ఉద్వేగాన్నిపెంచుకునే ప్రయత్రం చేయండి. ఎందుకంటే, యోని ఉద్దీపన అనేది దీర్ఘకాలిక వెన్నునొప్పి, కాలునొప్పి లాంటి వాటిని నిరోధిస్తుంది. దీంతో పాటు చాలా మంది మహిళల్లో జననేంద్రియ స్వీయ-ప్రేరణ అనేది తిమ్మిరి, తలనొప్పి, ఆర్థరైటిక్ నొప్పులను తగ్గిస్తుంది.



*తరచుగా స్థలనం చేసే పురుషుల చాలా తక్కువ శాతం ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు కొన్ని స్టడీలు చెబుతున్నాయి. దీనికి భాగస్వామి కూడా అవసరం లేదు. లైంగిక సంపర్కం, రాత్రిపూట ఉద్గారాలు మరియు హస్త ప్రయోగం వీటిలో ఏదైనా మంచి ఫలితం ఉంటుంది.



*సెక్స్ చేసిన తర్వాత త్వరగా నిద్రపడుతుంది. మీలో ఉద్వేగం పెరగడం వల్ల ప్రొలాక్టిన్ బయటకొచ్చాక మీకు తెలియకుండానే శరీరం అలసిపోయి.. మిమ్మల్ని త్వరగా నిద్రపుచ్చుతుంది.



*మీ భాగస్వామితో దగ్గరగా ఉంటే మీ ఒత్తిడి చాలా వరకూ తగ్గుతుంది. ముట్టుకోవడం, హత్తుకోవడం లాంటివన్నీ మీ శరీరంలో హార్మోన్లను రిలీజ్ అవడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా సెక్స్ చేయడం వల్ల మీ బ్రెయిన్ హ్యపీ కెమికల్ రిలీజ్ చేసి మిమ్మల్ని ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది.



*మెదడులో ఉండే హిప్పోక్యాంపస్ అనే ప్రాంతంలో కొత్త న్యూరాన్లు - మెదడు కణజాలం ఏర్పడేందుకు శృంగారం ఎంత గానో ఉపయోగ పడుతుందని తాజా పరిశోధనలలో తేలింది. హిప్పో క్యాంపస్ దీర్ఘకాల జ్ఞాపక శక్తికి ఉపయోగ పడుతుందని పరిశోధకులు వెల్లడించారు.



*ఎలుకలపై దీనికి సంబంధించిన ప్రయోగాలు చేసి, కొత్తగా న్యూరాన్లు ఏర్పడుతున్నా, లైంగిక కార్యకలాపాలు లేకపోతే మాత్రం, జ్ఞాపకశక్తి ఏమాత్రం పెరగలేదని మేరీలాండ్ విశ్వ విద్యాలయముకు చెందిన మానసిక వైద్యనిపుణులు వెల్లడించారు. శృంగారంలో పాల్గొనడం వల్ల మెదడు కణాల్లోకి ఆక్సిజన్ బాగా చేరుతుందని వాళ్లు గుర్తించారు.



*అలాగే, దక్షిణ కొరియాలోని కొంకుక్ విశ్వవిద్యాలయము చేసిన పరిశోధనలలో కూడా మరో ప్రబల సాక్ష్యం లభించింది. శృంగారం వల్ల తెలివి తేటలు పెరుగుతాయని, దీనివల్ల హిప్పోక్యాంపల్ ప్రాంతంలో న్యూరాన్లు కొత్తవి వస్తాయని వీళ్లు కూడా చెప్పారు. విపరీతమైన ఒత్తిడి కారణంగా మతిమరుపు వస్తే, తగ్గించడానికి ఈ న్యూరాన్లు ఉపయోగ పడతాయి. మలి వయసులో కూడా శృంగారాన్ని ఆస్వాదించే వారికి మతి మరుపు దగ్గరకు రాక పోవడం, డిమెన్షియా కూడా దరి చేరక పోవడం ఇందువల్లే నని వాళ్లు తేల్చి చెప్పారు.



*శృంగారంలో చురుగ్గా పాల్గొనే వారిలో అనారోగ్య సమస్యలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయని తాజాగా చేసిన అధ్యయనంలో తెలిసింది. ఎక్కువ సెక్స్ చేసే వారు క్రిములు, వైరస్ లాంటి ఇతర సమస్యలతో పోరాడే శక్తి కలిగి ఉంటున్నారట. వారంలో ఒకటి రెండుసార్లు శృంగారంలో పాల్గొనే వారి కన్నా, ఎక్కువ సార్లు పాల్గొనే వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్లు స్టడీలు చెబుతున్నాయి.







మరింత సమాచారం తెలుసుకోండి: