బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ.. ఈ పేరు వినడానికి వింతగాను, కొత్తగానూ ఉంటుంది కదూ.. అవును ఆ పేరుతో కాఫీ కూడా ఉందట.. ఉదయాన్ని చాలా మంది టిఫిన్ చేయడం వదిలేస్తారు. అలా చేయడం కారణంగా ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ఉదయాన్నే టిఫిన్ ను తప్పించడానికి ఈ కాఫీని వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ కాఫీలో అధిక కాలరీలు ఉంటాయి. ఒక్క ఈ కాఫీ లో  ఇందులో 2 కప్పులు కాఫీ, 2 టేబుల్ స్పూన్లు గ్రాస్ మిశ్రమం, ఉప్పు లేని వెన్న, బ్లెండర్లో కలిపి ఆయిల్‌తో కూడున్న 1-2 టేబుల్ స్పూన్లు ఇందులో వాడతారు.


బుల్లెట్ ప్రూఫ్ కాఫీని ఎవరయినా తాగవచ్చా అంటే, బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ కొంతమందికి పని చేస్తుంది - ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచని కెటోజెనిక్ డైట్‌ను అనుసరించేవారు. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అనేది అల్పాహారం భర్తీకి ఉద్దేశించిన అధిక కొవ్వు కాఫీ పానీయం. కీటోజెనిక్ ఆహారాన్ని అనుసరించే వ్యక్తులకు ఇది బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు. కొవ్వు ఎక్కువగా ఉన్న కూడా అల్పాహారం తీసుకోవడానికి టైం లేని వాళ్ళు ఎక్కువగా తాగుతారు. ఏది ఏమైనా కూడా మితంగా తాగితే ఆరోగ్యమే అన్న సంగతి తెలిసిందే..


శరీరంలో బాగా కొవ్వు కలిగిన వాళ్ళు ఈ కాఫీని అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే ఎందుకంటే ఇది కొవ్వును పెంచుతుంది కనుక. కనుక కొవ్వు సమస్యలు లేనివారు ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీని తీసుకోవచ్చు. ఇలాంటి కాఫీని ఎక్కువ దూరాలు ప్రయాణం చేసేవాళ్ళు ఎక్కువగా ఈ పానీయాన్ని సేవిస్తారు. చూసారుగా పేరుకు తగ్గట్లే ఈ కాఫీ కూడా ఉంటుంది. ఈ మధ్య జనాల్లోకి చాలా రకాల పానీయాలు అందుబాటులోకి వస్తున్నాయి. అలా వచ్చిన ప్రతీతి మంచిది కావు.. ఏది మంచిదో.. ఏది కాదో తెలుసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. మీరు ఎప్పుడైనా దీనిని ట్రై చేయండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: