మనిషి తన జీవన విధానంలో పెంపుడు జంతువులను తమ కుటుంబ సభ్యులుగా చేసుకునే ఆచారం ఎప్పటి నుండో ఉంది. ఈ కోవలో రైతు లకు ప్రాధాన్యతను అందరు చెపుతారు. ఎందుకంటే రైతు పొలం పనులకు జీవాలను వాడుతుంటారు, ఆ విధంగా ఆయన పశుపక్ష్యాదులతో కలిసి జీవనం గడుపుతూ ఉండటం సహజం. ఈ కోవలో ఎడ్లు, గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, కోళ్లు, తదితర జీవాలతో రైతు జీవిస్తుంటారు. ఇది సహజంగా భారతదేశంలో చూస్తూనే ఉంటాం. ఇతర దేశాలలో కూడా దాదాపుగా రైతు అనగానే పరిస్థితులు ఇలాగె ఉండవచ్చు. ఇక పట్టణాలలో అయితే బాగా పెంపుడు జంతువూ అని అనిపించుకునేది శునకం. ఇది అందరికి ఎంతగానో ఇష్టం.

సాధారణంగా చెప్పేటప్పుడు కూడా శునకాన్ని ఒక ముద్ద పెడితే అది జీవితాంతం విశ్వాసంగా ఉంటుందని. అది నిజమే, ఇంట్లో మిగిలింది ఒక ముద్ద ఈ ప్రాణికి పెడితే అది ఎంత విశ్వాసంగా ఉంటుందంటే, చాలా సార్లు యజమాని కోసం అతడి కుటుంబం కోసం ప్రాణాలు ఇచ్చిన పెంపుడు జీవాల గురించి చదువుతూనే ఉంటాం. మరి అలాంటి శునకాన్ని ఎవరు మాత్రం ప్రేమించకుండా ఉంటారు. అందుకే పట్టణాలలో వీలైనంత వరకు ప్రతి ఇంట్లో ఒక శునకం పెంపుడు జీవిగా ఉంటుంది.  చాలా మందికి వారి ఒంటరి జీవితానికి ఇదే ఎంతో వెసులుబాటుగా ఉంటుంది. ఇప్పుడు వీటికి కూడా అనేక రకాల ఆహారాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళే ఇంటికి వచ్చి, పెంపుడు జీవాలకు కావాల్సిన సేవలు చేసి వెళ్తున్నారు.

ఇలాంటి ఒక పెంపుడు జీవానికి యజమాని ఫ్లైట్ లో బిజినెస్ క్లాస్ లో అన్ని సీట్లు బుక్ చేసి గమ్యానికి చేర్చాడు. అసలు దేశీయ శునకాలను విమానంలో ఎక్కించుకునేది ఎయిర్ ఇండియా మాత్రమే. అది కూడా బుక్ చేసుకున్న సీటు చివరి వరుసలో వీటికి అనుమతి ఇస్తారు. అది కూడా కేవలం రెండింటినే. అలాంటిది ఏకంగా బిజినెస్ క్లాస్ లో ఉండే 12 సీట్లను ఈ ఒక్క శునకం కోసమే బుక్ చేశాడు ఆ యజమాని. గత జూన్ సెప్టెంబర్ మధ్య ఈ విమాన సర్వీస్ 2వేల పెంపుడు జంతువులను గమ్యాలకు చేర్చింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: