పసుపు అనేది సర్వరోగనివారిణి మాత్రమే కాదు ఆరోగ్యం ప్రధాయిని అని కూడా  చెబుతూ ఉంటారు. అయితే పసుపుతో ఎన్నో రోగాలను అరికట్టవచ్చునని చెబుతున్నారు. డయాబెటిస్ ఒకసారి వచ్చింది అంటే అది దీర్ఘకాలిక సమస్య కాబట్టి నెమ్మదిగా మన శరీరంలో ఉండే అవయవాలను కూడా దెబ్బతీస్తుంది అని,  ముందు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతే కాదు మనం ఏం తీసుకోవాలి అనుకున్నా కూడా ఆచితూచి షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి.

ముఖ్యంగా డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నవారు షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసే ఆహారం తీసుకోవడం చాలా ఉత్తమం.చాలామందికి  ప్రతిరోజు ఉదయం పూట వారు వండుకునే ఆహారంలో తప్పకుండా చిటికెడు పసుపు పైన ఉపయోగించడం అలవాటు.. అలా కొంత మంది వంటలలో ఉపయోగించ లేని వాళ్ళు  నేరుగా పసుపును తీసుకోవచ్చు. చక్కటి లైఫ్ స్టైల్ తో పాటు చక్కటి ఆహార నియమాలను పాటించడం వల్ల షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు.

అంతే కాదు చేసే డైట్ లో కొద్దిగా పసుపును గనుక జోడించి తీసుకున్నట్లయితే చక్కటి ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. ఈ కాలంలో మీరేమైనా డయాబెటిస్ టైప్-2 బారిన పడినట్టు అయితే పసుపుతో కొన్నిరకాల ఆహార నియమాలు పాటించడం వల్ల డయాబెటిస్ ను  ముందునుంచి అదుపులో ఉంచుకోవచ్చు. తాజా గా జరిపిన ఒక సర్వేలో పసుపులో కర్క్యుమిన్ అనే పదార్థం ఉంటుంది. కాబట్టి ఈ పసుపును డయాబెటిస్ ఉన్న వాళ్ళు కొద్దిగా తీసుకోవడం వల్ల రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిని తగ్గించి డయాబెటిస్ వల్ల వచ్చే సమస్యలను కూడా తగ్గించేస్తుందట.

అంతే కాదు శరీరంలో ఉండే కొవ్వును తగ్గించి, రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడి డయాబెటిస్ రాకుండా చేస్తుందట. డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు మీ డైట్ లో తప్పకుండా పసుపు ను చేర్చుకోవాలి అని వైద్యులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: