మెథ‌డ్స్ అండ్ మోటివ్స్

విస్తృత కాలాల చెంత

విస్తృతం అయిన దుఃఖాలు

ప్ర‌తిపాదిత దుఃఖాలు కూడా ఇవే


చుట్టూ ఉన్న ఆవ‌ర‌ణం ప్ర‌తిపాదిస్తే

కొన్ని అన్య కార‌ణాలు పీడిస్తాయి

కొన్ని అన్య కాలాలు వేధిస్తాయి


వాన అన్యం అయిన‌ది

ఇతరులకే కాదు ఎవ్వ‌రికీ చెందని  వాన ఒక‌టి

వెలుగు చెంత చీక‌టి చెంత

వియోగం చెంత విముఖ‌త చెంత కూడా!


చెంత ఉన్న వాన వియోగం

చెంత ఉన్న మ‌నిషి వియోగ కార‌ణం

ఎవ‌రినో దూరం చేసుకుంటే ద‌క్కే ప్రేమ అమూల్యం

దేనినో వ‌ద్ద‌నుకుని చేసే ప్ర‌య‌త్నం ఓ క‌వితాత్మ‌కం


ల‌క్ష‌ణం వాన‌ది కాదు నాది స్వ‌ర లాక్ష‌ణిక

ధోర‌ణుల్లో వాన‌లు కోకొల్ల‌లు నేల‌ను ముంచి

చావును ఇచ్చి పోతున్నాయి.. అవి రాయ‌ని

వాంగ్మూలాలే నా వాక్కుకు మూలం అయి ఉన్నాయి

ఆధారితం వాన కావొచ్చు కానీ దుఃఖం మాత్రం

మా తీరానే...



మార్నింగ్ రాగా : కొన్నే వాన‌లు..అకాల వాంఛితాన

ముంద‌రి నుంచి ప్ర‌తిపాదిస్తూ ఉన్నాను. వెనుక కాలం నుంచి తోడ్కొని వ‌స్తున్నాను. తోడుండేవ‌న్నీ మంచివే అన్న‌ది నాలో విరు ద్ధం. అందుకే విరుద్ధం అయిన తోడు వాన. విరుద్ధాల‌ను విస్తృతం చేసే తోడు వాన. ఈ త‌ర‌హా తోడు వ‌ద్ద‌ని చెప్ప‌గ‌ల‌నా? దుఃఖం దేహానికి, సుఖం ఆత్మ‌కు ఇచ్చి నింద మాత్ర‌మే కాలానికి ఆపాదించ‌డం అర్థం లేని ప‌ని అనుకుంటాను నేను. వాన దుఃఖం, దేహ దుఃఖం, నేల‌కు దుఃఖం, ప‌రిమ‌ళ సంబంధం కాని వాన‌ల‌న్నీ దుఃఖ స‌మూహాలే! అని చెబుతోంది ఈ మార్నింగ్ రాగా..



దుఃఖం నుంచి విముక్తం.. దుఃఖంతో పొందిన వైమ‌న‌స్యం.. అన్యం అని తోచిన ప్ర‌తీదీ కూడా నిషిద్ధ‌మే! క‌నుక వాన నిషిద్ధం. సంబంధిత కాలాల చెంత మ‌నిషి నిషిద్ధం. పొందే ప్రేమ‌కూ పొందాల్సి ఉన్న ప్రేమ‌కూ కూడా ఈ నిషిద్ధ గుణ‌కాలే అన్వ‌యాలు. అన్వ‌య సంబంధ అర్థాలు కూడా!



మ‌ళ్లీ వాన అని.. మ‌ళ్లీ రాని వాన ఇది అని ఇలా విభేదించి రాయ‌డంలో అర్థం వెత‌కాలి. మ‌ళ్లీ వాన పుట్టి ముంచిన వాన పుట్టు గుడ్డి వాన.. మ‌ళ్లీ రాని వాన.. రాకుండా ఉంటే మేలు. నేల‌ను నిస్సారం చేసేందుకు చేసే ప్ర‌య‌త్నాల‌న్నీ ఈ వాన‌లే చేస్తున్నాయి. సార‌ళ్యం అన్న‌ది నేల‌కు సారళ్యం అని చుట్టూ ఉన్న వాతావ‌ర‌ణానికి లేనంత‌గా పెన‌వేసుకుపోయిన సంద‌ర్భాలే ఇవి. మ‌నుషుల కు సార‌ళ్య‌త అన్న‌ది తెలియ‌దు. స‌హ‌న‌శీల‌త కూడా తెలియ‌దు. మ‌నిషి గెలిచి వాన ఓడిపోయిన రోజులు కొన్ని ముందున్నాయా అన్న‌ది నాలో ప్ర‌శ్న. అస‌లీ ద‌రిద్ర‌గొట్టు వాన‌ల నుంచి పొందే మిన‌హాయింపే పిల్ల‌లనూ పెద్ద‌ల‌నూ ఓ విముక్తం చేస్తాయి. అయినా ఈ వాన విముక్త ద‌శ నుంచి వికాస ద‌శ వైపు న‌న్ను కానీ ఈ లోకాన్ని కానీ తీసుకువెళ్తే చాలు. అదే ప్రాప్తం అని అనుకుంటాను.

ప్రాప్తం మ‌న‌సుది అయితే మేలు. ప్రాప్తం ఆత్మ సంబంధ‌ ఆనందాల‌ను ఇస్తే బాగుండు. ప్రాప్తం అనుకుంటేనే బ్ర‌తుకు కూడా పండుగ అవుతుంద‌ని ఓ చోట అన్నారు వేటూరి. ఈ ఆనంద సంబంధ ప్ర‌తిపాద‌న‌ల నుంచి ఉద‌యాల‌ను వాటి నిర్మాణాల‌ను కాలాలను వాటి ఆవాహ‌న‌ల‌ను అర్థం చేయించేది ఈ మార్నింగ్ రాగా. విముక్తం వైరాగ్యం కాదు ఒక యోగం. ఆ కోవ‌లో ఆ తోవలో దొర్లిన వ‌స్తువు స్వ‌ర వ‌ర్ఛ‌స్సును పొంది ఉంటుంది. ఆ స్వ‌రం స్థిరం అయి ఉంటుంది. అదే ఈ మార్నింగ్ రాగా..




ఉద‌యాల‌ను నిర్వ‌చితం చేయాలి లేదా ఉద‌య కాల విన్యాసాల‌ను నిర్వ‌చితం చేసేలా చూడాలి. అవునో కాదో కానీ ఒక అవ్య‌క్త చింత‌న నుంచి అవ్య‌క్త భావం నుంచి నేను అసందిగ్ధ‌త‌ల నుంచి పోగేసుకున్న కొన్ని ఊహ‌లే ఈ మార్నింగ్ రాగా.. అవునో కాదో కానీ మ‌నుషుల చిత్త ప్ర‌వృత్తి రీతుల‌లో ఏవో కొన్ని ఎక్కడో కొన్ని ఆగి ఉంటాయి. వాటి వ్య‌క్తీక‌ర‌ణ‌లు క‌న్నా మౌన వాంఛ‌లే ప్రేర‌ణ గుణ‌కాలు అయి ఉంటాయి. క‌నుక ఊహ వాంఛితం.. మౌనం కొన్ని సార్లే అవాంఛిత ప్రేర‌ణ అని రాయాలి నేను. వాన కూడా  వెల‌సి పోయాక నాలో ఓ అవాంఛిత అసంక‌ల్పిత ప్రేర‌ణ కూడా అయి తీరుతుంది. కావొచ్చు! మే ఆర్ మే నాట్... ఇట్ కుడ్ బి..

తెలియ‌దు రా!


మ‌నుషుల్లో ల‌క్ష‌ణాల‌ను నిర్వ‌చించడం వాన‌లో రుతు ప్ర‌యాణ ప్రాభ‌వాన్ని వ‌ర్ణించ‌డం ఒక ప్రాసంగిక చిత్తం అయి ఉంటుంది నాలో! స్వ‌భావం నుంచి ఒక ప్ర‌తిపాద‌న..అనంతానంతం అయి ఉంటుంది నాలో! క‌నుక ప్ర‌తి రోజూ రాసే కొన్ని మాట‌లు స్వ‌భావాన్నీ చిత్త చాప‌ల్యాన్నీ దాటి ఒక ప్ర‌వాహ ధ‌ర్మాన్ని అనుస‌రించి పోతాయి నాలో! క‌నుక కొత్త పాట‌లూ కొత్త కానుక‌లు ఇవ్వాలి అని కోరుకుంటాను. విజ్ఞ‌క్ష‌త‌తో కూడిన ప్ర‌తిపాద‌న‌లు క‌న్నా తిరుగుబాటుతో కూడిన అన్వ‌య‌మో అన్య స్వ‌ర‌మో నాకెంతో ఇష్టం అయి ఉంటుంది. మ‌న‌లో కొన్ని మాత్రమే ఇప్ప‌టి క‌న్నా ఉన్న‌తిని కోరుకుంటాయి. వాన‌లు మాత్రం ఉన్న‌తిని పొంది మ‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాయి. అది పీడ‌న‌లో ఉన్న‌తి కాదు అథ‌మం అల్పం కానీ అల్ప కాల విజ్ఞ‌త చెంత వాన ఉన్న‌తిని పొంది మేఘ వ‌ర్ణాల ఛాయ‌ల‌ను మోహ వ‌ర్ణాల ఛాయ‌ల‌ను వాంఛితం చేసింది. క‌నుక వాన‌కు గుడ్డిత‌నం ఆపాదించారొక‌రు. క‌నుక అది గాంధారీ వాన అయింది. వేడి క‌ప్పులో కొన్ని ఊసులు.. ఊహ‌లు పైకి తేల‌ని అల‌లు..తేలిన సుడులు ఇవ‌న్నీ సదృశ రూపాలే..

అక్ష‌ర వాంఛితాలే! అవ్య‌క్త వాంఛితం అని రాయాలి నేను. ఆనందించాలి మీరు ఆనందించాలి నేను.


ఊరి నుంచి పోయాడొక‌డు.. అత‌డు స్వప్న కాల ప్రావ‌స్థ‌ల్లో ఉన్నాడు. వాన కూడా స్వ‌ప్న కాల ప్రావ‌స్థ‌నే తీసుకువ‌చ్చింది. క‌నుక ఉద‌యం వ‌చ్చిన వాన‌లో ఏమయినా ద‌యా లేదా క‌రుణ ఉండి ఉండాలి. మ‌నుషుల‌ను ఏకం చేసే వాన‌లు ఇంకా పెట్టి పుట్ట‌లేదు అని అంటాన్నేను. ఇదే మాట కూడా అనిపిస్తాను నేను. ప్ర‌భావశీల‌క ధోర‌ణిలో రాస్తున్నానొక వాక్యం. వాంగ్మ‌యం అని రాయాలి నేను. నేను రాసేదంతా పాటింపులో ఉన్న చోటు గొప్ప గొప్ప మార్పులన్న‌వి కొన్ని ద్విగుణీకృతం అవుతాయి. అవును జీవితం అలాంటి అక్ష‌ర శ్రేణుల‌నో రాశీ న‌క్ష‌త్రాల‌నో పోగేసుకుని ఉంటుంది. గొప్ప వాన‌లు కొన్ని సుప్తావ‌స్థ‌లో ఉంటాయి. నిదురించే తోట‌లు ఏమ‌యినా ఉన్నాయో లేవో కానీ మ‌ధూళి రేగిన వేళ వాన ఒక  శృంగార కేళి. మ‌నో వాంఛ కూడా!


వాంఛితం ఏదో తెలియాలి. తెలిసినవ‌న్నీ గొప్ప‌వి అయి ఉండాలి. స్వ‌రం వాంఛితం..ప్రేమ వాంఛితం..దుఃఖం కూడా వాంఛితం కావాల‌న్న‌ది ఓ ప్ర‌తిపాద‌న..అవుతుందో లేదో అన్న‌ది ఓ సంశయాత్మ‌కం. అవును మ‌నుషుల‌లో ఎలాంటి ప్రేమ‌లు..ఎలాంటి దుఃఖాలు మ‌నం చూడ‌గ‌లం. ఊహ‌ను ర‌ద్దు చేస్తే వాస్త‌వం ఒకటి వాన చెంత వెలిసిపోయి ఉంటుంది. అవునత‌ను జ‌స్ట్ నీడ్ టు గో!

వాన ఉన్న‌ప్పుడే తిల‌క్ ఊరి చివ‌రి ఇల్లు క‌థ రాశారు. అవున‌త‌డు వాన  ఉన్న‌ప్పుడు ఏకాంతాలను వాంఛితం అని భావించాడు.

ఇప్ప‌డయినా ఎప్పుడ‌యినా ఈ వాన‌ల‌న్నీ అకాలాలే  కావాలి. లేదా అనంత దుఃఖాల చెంత మ‌నుషుల‌కో గొప్ప ప‌రివ‌ర్త‌న కేంద్రం సృష్టించాలి. ఇలాంటి వాన‌లు ఇలాంటి ఉద‌యాలు మ‌న జీవితాల్లో వెల‌సి పోవాలి వెలిగి రావాలి.

- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

అకాల వానల చెంత..

సంబంధిత ప్ర‌తిపాదిత స్వ‌ర

చింత‌న‌ల చెంత....

మరింత సమాచారం తెలుసుకోండి: