చిన్న ప‌శువుల శాల‌లో పుట్టిన బాలుడు లోకాన్ని ర‌క్షించే ఏసు అయ్యాడు.శాంతి, స‌హ‌నం అన్న‌వి ప్ర‌ధాన ఆచ‌ర‌ణ‌లు అని, అ వి మాత్ర‌మే ప్ర‌పంచ గ‌మానాన్ని నిర్దేశించా ల‌ని చెప్పిన ప్ర‌భువు గాధ స్మ‌ర‌ణ అయింది. స్ఫూర్తి అయింది. పాటించ‌డమే స్ఫూర్తికి అర్థం. ప్రార్థించ‌డం బాధ్య‌త.


ముళ్లెన్నో ఉంటాయి..దారి అస్త‌వ్య‌స్తం అయి ఉంటుంది. తోటి వారు వ‌ర‌ద‌ల్లో ఉంటారు..తోటి వారు క‌ష్టంలో ఉంటారు..తోటి వారిని ఆదుకునే ప‌ని ఒక‌టి దైవాజ్ఞ నిర్దేశించి ఉంటుంది. ఆజ్ఞ‌ను పాటించ‌డం క‌ర్త‌వ్యం.. దైవ జ‌నుల క‌ర్తవ్యం ఇది ఒక్క‌టే.. ప్రేమ,క‌రుణ పంచే విధంగా ఉండే ప్రార్థ‌న‌ను మాత్రమే ప్ర‌తి ఒక్క‌రూ చేయాల‌న్న దైవ సందేశం ఈ క్రిస్మ‌స్ మ‌రో మారు గుర్తు చేస్తుంది. స్మ‌రణను విని పుల‌కించి పోవ‌డం క‌న్నా బాధ్య‌త‌ను గుర్తు చేసుకుని క‌ర్త‌వ్య పాల‌న చేయ‌డ‌మే దేవుడికి ఇచ్చే గొప్ప కానుక. బిడ్డ‌లంతా ఇదే చేయాలి ..


ఏసయ్య రాక‌ను ఆకాశంలో తార‌లు సంకేతిస్తాయి..క‌రుణామ‌యుని సూక్తిని అవి కాంతి ధార‌ల న‌డుమ తీసుకువ‌స్తాయి. ప్రభువు నేర్పిన సూక్తిని ప్ర‌పంచం అర్థం చేసుకోవ‌డంలోనే నిజ‌మైన ప్రార్థ‌న ఉంది. అవును ప్రార్థిస్తేనే ఫ‌లితాలు. ప్రార్థ‌న‌తోనే గొప్ప విజ‌యాలు. గాయాల‌ను త‌రిమికొట్టేంత శ‌క్తి.. కొత్త ఉత్సాహాన్ని నింపే శ‌క్తి ఒక్క ప్రార్థ‌న‌కే ఉంద‌ని వివ‌రించే సందేశం ప్ర‌భువుది.


స‌మ‌స్త మాన‌వాళికి మంచి చేసే విధంగా ఓ పండుగ..స‌మ‌స్త మాన‌వాళి శ్రేయ‌స్సును కోరే విధంగా పండుగ..తార‌ల పండుగ క్రిస్మ‌స్ పండుగ..మ‌నిషి త‌న‌కి తాను వృద్ధిని కోరుకోవ‌డం,ఆ విధంగా కృషి చేయ‌డం ఎన్న‌డూ ఉండేదే. ఇతరుల క్షేమం కోరి శాంతి కోరి చేసే ప్ర‌యాణం ప్రార్థ‌న అన్న‌దే కీల‌కం కావాలి. క్రిస్మ‌స్ పండుగ కానుక‌లు ఇచ్చే పండుగ..కానుక‌లు స్వీక‌రించే పండుగ..మ‌నిషి ఓ చోట నిలిచి త‌న‌ని తాను తెలుసుకుని ప్ర‌భువైన ఏసు క్రీస్తు సందేశాన్ని వివ‌రంగా అర్థం చేసుకోవాల‌ని సూచించే పండుగ. అంద‌రికీ క్రిస్మ‌స్ పండుగ శుభాకాంక్ష‌లు.




మరింత సమాచారం తెలుసుకోండి: