- వ‌రుస‌గా ఐదో గెలుపున‌కు రెడీ అవుతోన్న గొట్టిపాటి ర‌వి
- క‌మ్మ సీటులో జిల్లాలు దాటించి రెడ్డిని పోటీ పెట్టిన జ‌గ‌న్‌
- ఫోన్ స్విచ్ఛాఫ్‌లు, స‌డెన్‌గా మాయ‌మైపోతోన్న వైసీపీ క్యాండెట్‌
- జ‌గ‌న్ వ‌చ్చినా అందుబాటులో లేని వైనం.. టీడీపీ మెజార్టీ మీదే లెక్క‌లు

( ప్ర‌కాశం - ఇండియా హెరాల్డ్ )

గత ఎన్నికల ప్రచారంలో జగన్ తన పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి టీడీపీలోకి వెళ్లిన అందరినీ ఓడిస్తానని ముందుగానే శపథాలు చేయడంతో పాటు.. ఆయా నియోజకవర్గాలలో అందుకు అనుగుణంగానే అభ్యర్థులను నిలబెట్టి విజయం సాధించారు. అయితే వైసీపీని వీడీ టీడీపీ నుంచి పోటీ చేసిన అందరూ ఓడిపోగా.. గెలిచిన ఒకే ఒక్క నేత అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. సహజంగానే తన నుంచి వెళ్లిపోయిన నేత‌లెవ్వరు విజయం సాధించటం ఏమాత్రం ఇష్టపడ‌ని జగన్‌కు గొట్టిపాటి గెలవటం నచ్చలేదు. అందుకే ఐదు ఏళ్లలో గొట్టుపాటిని పలు రకాలుగా ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ఆయన గ్రానైట్ వ్యాపారాలపై దాడులు జరిగాయి. పార్టీ మారాలని ఒత్తిళ్లు వచ్చాయి.
 

అయినా గొట్టిపాటి కోట్ల రూపాయలు నష్టపోయినా.. ఎన్ని కేసులు ఎదుర్కొన్నా.. టీడీపీ వైపే ఉన్నారు. అంతేకాదు తన కుటుంబానికి దర్శి సీటు ఇప్పించుకోవడంతో పాటు.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరో ఐదారు నియోజకవర్గాలలో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఖర్చులు కూడా భరిస్తున్నారు. వరుసగా నాలుగు సార్లు గెలిచిన గొట్టిపాటి.. ఐదోసారి అసెంబ్లీ బరిలో ఉన్నారు. రెండు పక్షాల వైపు సాంప్రదాయంగా కమ్మ సీటుగా వస్తున్న అద్దంకిలో.. ఈసారి జగన్ ప్రయోగం చేశారు. ఎక్కడో పలనాడు జిల్లాలోని క్రోసూరు మండలం దొడ్లేరుకు చెందిన పారిశ్రామికవేత్త పాణెం చిన్న హ‌నిమిరెడ్డిని తీసుకువచ్చి.. అద్దంకిలో పోటీకి పెట్టారు. ఆయనకు ముందుగానే సీన్ అర్థమైందో ఏమో కానీ.. సడన్గా ఫోన్ స్విచాఫ్ చేసుకుని మాయం అయిపోతున్నారట‌.


ఒక్కోసారి ప్రచారానికి కూడా రావడం లేదని వైసీపీ వాళ్ళు గగోలు పెడుతున్నారు. కొద్దిరోజుల క్రితం జగన్ నియోజకవర్గ పరిధిలోని సంతమాగులూరుకు ప్రచారానికి వచ్చినా కూడా హ‌నిమిరెడ్డి కనిపించలేదు. జగన్ తో పాటు హ‌నిమి రెడ్డికి సీటు ఇప్పించిన జగన్ బాబాయ్ వై.వి.సుబ్బారెడ్డి సైతం.. ఆయన తీరుపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో స్థానికంగా జరుగుతున్న ప్రచారం ఏమిటంటే.. ఎలాగో ఓడిపోతాం.. ఈ టైంలో కొట్లాది రూపాయలు ఖర్చు చేస్తే అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి.. అలాంటప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉండటమే బెటర్.. అన్న నిర్ణయానికి ఆయ‌న వచ్చినట్టు తెలుస్తోంది.


ఒకానొక దశలో హ‌నిమిరెడ్డికి సీన్ అర్థమై తను పోటీ చేయనని చెప్పేసారని.. అయితే సుబ్బారెడ్డి తో ఉన్న వ్యాపార లావాదేవీల నేపథ్యంలో సుబ్బారెడ్డి బెదిరించి మరి ఆయనను పోటీకి పెట్టారని కూడా అంటున్నారు. సుబ్బారెడ్డి తో ఉన్న బిజినెస్ డీల్ ను టిక్కెట్ ఇచ్చి చేతులు దులిపేసి సెటిల్ చేసుకున్నారన్న ప్రచారం కూడా నడుస్తోంది. గత ఎన్నికలలోనే గొట్టిపాటికి ఏకంగా 14వేల‌ మెజార్టీ వచ్చింది. ఈసారి ఇది కచ్చితంగా 25 నుంచి 30 వేలు దాటుతుందని.. ఎన్నికల టైంకు ఇది మరింత పెరిగినా ఆశ్చర్య పోనక్కర్లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: