ఏపీ సీఎం జగన్‌కు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో 5 గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేయబోతున్నామంటూ కీలకమైన వివరాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. భారత్‌ మాల పరియోజన తొలి దశ కింద ఆంధ్ర ప్రదేశ్‌కు ఈ అయిదు గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌లు దక్కబోతున్నాయని కేంద్ర మంత్రి గడ్కరీ వివరించారు. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రాజ్యసభలో ఈ శుభవార్త వివరాలను వెల్లడించారు.


వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి గడ్కరీ రాతపూర్వకంగా ఈ జవాబిచ్చారు. ఈ అయిదు గ్రీన్‌ ఫీల్డ్‌  ప్రాజెక్ట్‌లు 2026-27 నాటికి పూర్తి చేస్తారట. మంత్రి గడ్కరీ ఈ  అయిదు గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ల వివరాలు కూడా వెల్లడించారు. అవేంటంటే.. విశాఖపట్నం-రాయపూర్‌ మధ్య 100 కిలోమీటర్లు దూరం ఆరు వరసల జాతీయ రహదారి నిర్మిస్తారట. దీనికి 3183 కోట్ల రూపాయలు మంజూరు చేశారట. ఇందులో ఇప్పటికి 202 కోట్ల రూపాయలు ఖర్చు కూడా చేశారట.


ఇక రెండోది.. ఖమ్మం-దేవరాపల్లి మధ్య 56 కి.మీ దూరం నిర్మించే నాలుగు వరుసల రహదారి. దీని కోసం 1281 కోట్ల రూపాయలు కేటాయించారట. ఇప్పటికి 200 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. మూడోది..  చిత్తూరు-థాట్చూర్‌ మధ్య 96 కి.మీ దూరం నిర్మించే ఆరు వరసల రహదారి. దీనికి  3179 కోట్లు కేటాయించారట. ఇప్పటి వరకు 123 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. నాలుగోది బెంగుళూరు-చెన్నై మధ్య 85 కి.మీ దూరం నిర్మించే ఎక్స్‌ప్రెస్‌వే. దీని కోసం 4137 కోట్లు కేటాయించారట. దీనికి ఇప్పటికి 123 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట.


ఐదోది ముఖ్యమైంది.. బెంగుళూరు-విజయవాడ మధ్య 343 కి.మీ దూరం నిర్మించే కారిడార్‌. ఇక ఈ ప్రాజెక్ట్‌ తీరుతెన్నులు, ఖర్చుకు సంబంధించి డీటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ రూపొందిస్తున్నారట. ఇవే కాకుండా ఏపీలో 5347 కోట్లతో 28 ఆర్వోబీలు కూడా నిర్మాణంలో ఉన్నాయట. ఈ 28 ఆర్‌వోబీ, ఆర్‌యూబీల నిర్మాణానికి 5347 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: