వాతావరణంలో మార్పులు.. రోజురోజుకు ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి. భానుడు భగభగ మండుతున్నాడు కాబట్టి తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు కూడా తమ స్తోమతను బట్టి పలు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇల్లు అలాగే చుట్టుపక్కల పరిసరాలను చల్లగా ఉంచుకోవడం కోసం కూలర్లను, ఏసీ లను వినియోగిస్తున్నారు. నిరంతరం వీటిని ఉపయోగించడం వల్ల ఖర్చు కూడా ఎక్కువవుతుంది. కరెంటు బిల్లు తడిసి మోపెడవుతుంది. కొన్ని చిట్కాలు పాటించి ఎండ వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు.

ముఖ్యంగా వేడి ఎక్కువగా ఉన్న రోజుల్లో రాత్రిపూట ఉష్ణోగ్రత తగ్గించడానికి, ఇంటికి ఉన్న కిటికీల ను తెరవడం మంచిది. రాత్రంతా రిఫ్రెష్ గా ఉండడానికి పడుకునే ముందు కిటికీలు పూర్తిగా తెరవండి. ఉదయాన్నే వేడి తీవ్రత పెరిగే సమయానికి మీరు కిటికీ లు మూసివేయడం వల్ల ఇంట్లో వాతావరణం చల్లగా ఉంటుంది. పరుపులను కాలానుగుణంగా మార్చితే గది కూడా తాజాగా చల్లగా ఉంటుంది. ఇక పరుపులను ఉన్ని ద్వారా తయారు చేసినవి ఉపయోగించడం కంటే పత్తి ద్వారా తయారుచేసిన పరుపులను ఉపయోగిస్తే చల్లగా ఉండటానికి దోహదపడుతుంది.

ఇక చిల్లో దిండు ను తలకింద ఉంచుకోవడం వల్ల మిమ్మల్ని మీరు చల్లగా ఉంచుకోవడానికి ఇది ఒక గొప్ప మార్గం అని చెప్పవచ్చు. తక్షణ చల్లదనం పొందడం కోసం శరీరం వెనకాల లేదా పాదాల వద్ద ఈ చిల్లో దిండు ను  ఉంచుకోవచ్చు. నిద్రించే ముందు మోకాలి కింద షీట్లను పెట్టడం వల్ల చల్లని అనుభూతి కలుగుతుంది. బ్లాక్ అవుట్ కర్టెన్ల ను ఉపయోగించడం వల్ల వేడి లోపలికి రాదు. సూర్యరశ్మిని 33 శాతం వరకు తగ్గించడానికి ఈ ప్లాస్టిక్ షీట్ లు బాగా ఉపయోగపడతాయి.

లైట్లను ఆఫ్ చేయాలి. లైట్ వల్ల వేడి ఉత్పత్తి అవుతుంది కాబట్టి 6 గంటల సమయం దాటిన తర్వాత ఇంట్లో లైట్లు వెలిగేలా చూసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: