ప్రస్తుతం ఎండ తీవ్రత ప్రతిరోజు పెరుగుతూనే ఉంది కాబట్టి.. ప్రతి ఒక్కరు ఎక్కువగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా శరీరాన్ని శక్తివంతంగా, చురుకుగా ఉంచడానికి సహాయ పడే ఆహారాలను తీసుకోవడం మంచిది. ఇలాంటి పోషకాలు అన్ని ఎక్కువగా బెండకాయలలో దొరుకుతాయి. అయితే ఇప్పుడు బెండకాయ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం.

బెండకాయ లో ఎక్కువగా విటమిన్ బి 6, ఫైబర్, ఫోలేట్ తో సహా అనేక పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. దీనివల్ల చక్కెర స్థాయిలను నియంత్రించడానికి చాలా సహాయపడుతుంది. తక్కువ కేలరీలు, ఫైబర్  బెండకాయలలో చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఇది రక్తంలో ఉండే చక్కెర స్థాయిని క్రమంగా విడుదల చేయడం వల్ల మన శరీరంలో షుగర్ లెవెల్ పెంచకుండా సహాయపడుతుంది.

బెండకాయ లో చాలా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది.. ఇక తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను బాగా తగ్గిస్తాయి. అయితే బెండకాయల తో చేసిన నీటిని తాగడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ నీటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కొన్ని బెండకాయలను తీసుకొని వాటిని బాగా కడిగిన తర్వాత.. బెండకాయ లోని మొదలు, చివరలను కత్తిరించిన తరువాత వాటిని సగానికి కట్ చేసి.. వాటిని ఒక నీరు ఉన్న గిన్నెలో వేసి నానబెట్టాలి. ఇలా ఒక రోజు నానబెట్టిన తర్వాత మరుసటి రోజు ఉదయం ఆ నీటిని ఏదైనా క్లాత్ తో పిండాలి. అలా వచ్చిన నీటిని తాగడం వల్ల మనం ఎన్నో పోషకాలను పొందవచ్చు. ఇలా నెలలో కనీసం రెండు మూడు సార్లు అయినా చేస్తే ఎన్నో రోగాల నుంచి మనం మనల్ని కాపాడుకోవచ్చు. అంతే కాకుండా బెండకాయ ఫ్రై, పచ్చడి చేసుకోవడం వల్ల మరింత రుచిగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: