సాధారణంగా షుగర్ వ్యాధిగ్రస్తులు షుగర్ తినకుండా ఉంటే చాలు..వారి శరీరంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ వుంటాయని అపోహ పడతారు. కేవలం చక్కర తినడం మానేయడం వల్ల షుగర్ తగ్గదు.శరీరంలోని షుగర్ లెవల్ ని కంట్రోల్ చేయడానికి కొన్ని ఆహారాలు కూడా దోహదపడతాయి. అలాంటి ఆహారాలు తినడం వల్ల మన షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

1).రైస్..
బియ్యంతో చేసిన అన్నం తినడం వల్ల ఇందులో వున్న కార్బోహైడ్రేట్స్ మన రక్తంలోని షుగర్ లెవెల్స్ ని హెచ్చుతగ్గులు చేస్తాయి.

2).ఫ్రూట్స్..
అరటిపండ్లు, ద్రాక్ష, చెర్రీస్, మామిడి పండ్లలో కార్బోహైడ్రేట్లు,మరియు సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. అంతేకాక గ్సైసిమిక్‌ ఇండెక్స్‌ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి.

3).వైట్‌ బ్రెడ్‌..
వైట్ బ్రెడ్ లోఅధిక కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వీటిని జీర్ణశయం విచ్ఛిన్నం చేసి గ్లూకోజ్‌గా మారుస్తుంది. వీటిలో ఫైబర్‌ తక్కువ స్థాయిలో ఉంటుంది . ఫైబర్‌‌ బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.మధుమేహంతో ఇబ్బంది పడేవారు పాస్తా, నూడుల్స్‌‌ వంటి వాటిని దూరంగా ఉంచితే మంచిది.

4).మాంసం
మధుమేహంతో బాధపడేవారు రెడ్‌ మీట్‌ కి దూరంగా ఉండటం మంచిది. రెడ్‌ మీట్‌, బేకన్‌, హామ్‌ వంటి శుద్ధి చేసిన మాంసాహారంలో అత్యధిక ప్రోటీన్స్ కలిగి ఉంటాయి.ఇది రక్తంలోని ఇన్సులిన్‌ లెవెల్స్ కూడా పెంచుతాయి.

5).పాలు..
పాలతో తయారు చేసే ఉత్పత్తులు ఎక్కువగా తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ హెచ్చు తగ్గులు అయ్యో అవకాశాలు అధికంగా ఉంటాయి.పాలలో లాక్టోస్ అనే సులభంగా జీర్ణమయ్యే చక్కెర ఉంటుంది. కానీ, పాలలో దీనిని నిరోధించే ప్రోటిన్‌‌‌‌ ఉంటుంది. పాలు తక్కువగా తాగడం మంచిది. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు మసాలాలు తిన్న వెంటనే పాలు త్రాగటం వల్ల రక్తంలోని ఇన్సులిన్ లెవెల్స్ క్రమరాహిత్యంగా తయారవుతాయి.

ఇటువంటి ఆహారాలకు దూరంగా వుంటూ చక్కటి వ్యయమాలు చేస్తే షుగర్ కంట్రలోలో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: