తమకంటే చిన్న వయస్సు ఉన్న వారిని పెళ్లి చేసుకోవడం కాదు తమతో సమానంగా వయసు ఉన్న వారిని పెళ్లి చేసుకోవడం కూడా చూస్తూ ఉన్నాం. అంతే కాదు కొంతమంది ఏకంగా తమకంటే వయసు ఎక్కువ ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి కూడా వెనకడుగు వేయడం లేదు అబ్బాయిలు. ఇక ఇలా తమకంటే పెద్ద వారిని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు మరింత ఆసక్తి చూపుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ప్రేమకు వయసు లేదని ఎంతోమంది అంటూ ఉంటారు. నేటి రోజుల్లో యువత దీనిని నిజం చేసి చూపిస్తున్నారు. అయితే నేటి రోజుల్లో ఎంతో మంది అబ్బాయిలు ఇలా తమకంటే పెద్దవారిని ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి అన్న విషయం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇక ఆ విషయాలు ఏంటో తెలుసుకుంటే.. తమకంటే పెద్ద వయసు స్త్రీలను అబ్బాయిలు ఇష్టపడటానికి కారణం.. తమ కంటే పెద్దవారైతే అన్న విషయాల్లో కూడా మార్గదర్శకంగా ఉంటారని.. అధిక పరిపక్వత స్థాయి.. తెలివిగా కమ్యూనికేషన్.. తక్కువగా తమ మీద ఆధారపడటం లాంటివి ఉంటాయని పురుషులు తమ కంటే పెద్ద వయసులో అమ్మాయిల వైపే ఆకర్షితులు అవుతున్నారట. ఇక తమకంటే పెద్ద వయసు ఉన్న అమ్మాయిలు తమ నిర్ణయాలు తప్ప ఉప్ప అన్న విషయాలపై కూడా జడ్జ్ చేస్తారని.. ఇక సరైన సమయంలో మంచి నిర్ణయాలు తీసుకొని కుటుంబ వ్యవహారాలను చక్కపరచడంలో పరిజ్ఞానం కనబరిస్తారని అబ్బాయిలు అనుకుంటారట. అంతే కాదు తమకంటే పెద్ద వయసు ఉన్న స్త్రీలు అబ్బాయిల కంటే ఎక్కువ జీవితానుభవాన్ని కలిగి ఉండటం వల్ల స్థిర ఆలోచనలతో మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందట. అందుకే అబ్బాయిలు తమకంటే పెద్దవారైనా అమ్మాయిలను ఇష్టపడుతున్నారట.