పెరుగు..
మనం తినే భోజనంలో రోజు పెరుగును చేర్చుకోవడం వల్ల,ఇందులోని ప్రోబయాటిక్స్ మనం తిన్న ఆహారాన్ని శుభ్రంగా జీర్ణం చేస్తాయి.అంతేకాక జీర్ణం కానీ వ్యర్థన్ని తొలగించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడి, చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోకుండా కాపాడుతాయి.కావున దీనితో సులభంగా,తొందరగా బరువు తగ్గవచ్చు.మరియు ఇందులో విటమిన్లు,ఖనిజాలు, ఫైబర్,ప్రోటీన్ వంటివి పుష్కలంగా లభించడంతో చాలా సేపు ఆకలి కంట్రోల్ లో ఉంటుంది.
జీలకర్ర వాటర్..
పొద్దున్నే లేవగానే పరగడుపుని జీలకర్ర,తేనె కలిపిన వాటర్ తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడి,మనం తిన్న ఆహారాన్ని శుభ్రంగా జీర్ణపరచడమే కాకుండా,చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది.దీనితో ఎక్కువ శ్రమ పడకుండా, తొందరగా బరువు తగ్గవచ్చు.
చియా సీడ్స్..
ఈ మధ్యకాలంలో డైట్ పేరు చెప్పగానే ముందుగా చియా సీడ్స్ నే ఎంచుకుంటారు.ఎందుకంటే ఇందులో అధిక ఫైబర్ కలిగి ఉండడంతో,మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోకుండా అడ్డుకుంటుంది.అంతేకాక చియా విత్తనాలు కూడా శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి సహాయపడతాయి.ఇది కూడా బరువు తగ్గించడానికి మరొక మార్గం.
వెల్లుల్లి..
ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ప్రోటీన్, మాంగనీస్,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కళంగా లభిస్తాయి.ప్రతిరోజు వీటిని వీలైనంతగా ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవడంతో,ఇది పొట్టభాగంలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది.దానితో కూడా తొందరగా బరువు తగ్గవచ్చు.
దాల్చినచెక్క..
ఇందులో సిన్నమాల్డిహైడ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది థర్మోజెనిసిస్ ను యాక్టివేట్ చేసి,శరీరంలో ఉష్ణోగ్రత పుట్టించే ప్రక్రియ మొదలెడుతుంది.ఈ ఉష్ణోగ్రత కేలరీలను బర్న్ చేస్తుంది.పరగడుపునే దాల్చినచెక్క టీ తీసుకోవడంతో అధికబరువును తగ్గించుకోవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి