సాధారణంగా ప్రతి ఒక్కరు రోజుకు అర లీటర్ నుంచి లీటర్ వరకు పాలను తీసుకోవడం వల్ల,అధిక క్యాల్షియం అందుతుందని తాగుతూ ఉంటారు.మన శరీరానికి అధిక క్యాల్షియం అందడం వల్ల రక్తం గడ్డకట్టడం,రక్తం ఉత్పత్తికి,దంతాలు బలంగా ఉండడం కోసం,ఎముకలు దృఢంగా ఉండటానికి,కండరశక్తికి,గుండె జబ్బులను నివారించడానికి ఉపయోగపడుతుంది.ఇన్ని ఉపయోగాలు ఉన్న పాలను తీసుకోవడం వల్ల చాలామందికి అలర్జీ కలుగుతూ ఉంటుంది.

అలాంటివారు పాలకు ప్రత్యామ్నాయంగా కొన్ని రకాల పదార్థాలను తీసుకుంటే సరిపోతుందని ఆహారాన్ని పనులకు సైతం చెబుతున్నారు.ఆ పదార్థాలు రోజు తీసుకోవడంతో పాలను అవాయిడ్ చేయొచ్చని కూడా సూచిస్తూ ఉన్నారు.మరి అలాంటి పదార్థాలు ఏంటో మనము తెలుసుకుందాం పదండి..

బాదం..
రోజుకు ఐదు నుంచి 6 నానబెట్టిన బాదం తీసుకోవడం వల్ల,ఒక గ్లాసు పాలలో దొరికే క్యాల్షియం ఇందులో పుష్కలంగా లభిస్తుంది.కావున పాలు అంటే ఎలర్జీ కలవారు రోజుకు 5 నుంచి 6 వరకు బాదం తీసుకోవడం ఉత్తమం.

రాగి ఉత్పత్తులు..
రాగి పిండితో తయారు చేసుకునే జావా,రొట్టె సంగటి వంటివి తీసుకోవడం వల్ల ఒక గ్లాస్ పాలల్లో దొరికే కాల్షియం కన్నా ఇందులో ఎక్కువే లభిస్తుంది.మరియు ఇందులో వున్న ఐరన్ కంటెంట్ రక్తహీనత రాకుండా కాపాడుతుంది.మరీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు రాగి ఉత్పత్తులను తీసుకోవడం చాలా ఉత్తమం.

పొద్దుతిరుగుడు విత్తనాలు..
గుప్పెడు పొద్దు తిరుగుడు విత్తనాలు తినడం వల్ల 360 గ్రాముల క్యాల్షియం మన శరీరానికి అందుతుంది. అంతేకాక ఇందులోనే మెగ్నీషియం కండరాలు బలంగా తయారవడానికి కూడా దోహదపడతాయి.


సోయా పాలు..
పాలకు  కరెక్ట్ ప్రత్యామ్నాయంగా సోయా పాలని చెప్పవచ్చు.ఇందులో ఉన్న క్యాల్షియం మరియు విటమిన్ డి ఎముకల దృఢత్వానికి మరియు కండర శక్తికి చాలా బాగా సహాయపడతాయి.

చియా సీడ్స్..
పాలు అంటే ఎలర్జీ కలవారు రోజుకు ఒక స్పూన్ చియా సీడ్స్ తీసుకోవడంతో మన శరీరానికి కావాల్సిన క్యాల్షియం,విటమిన్ డి మరియు మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది.వీటిని తినలేని వారు పెరుగుతో కలిపి తీసుకోవచ్చు.

కావున మీరు కూడా పాల అలెర్జీ వంటి సమస్యలు కలిగి ఉంటే పైన చెప్పిన ఆహారాలతో భర్తీ చేయడం చాలా మంచిది.లేకపోతే ఎన్నో అనారోగ్యాలను మనం కొని తెచ్చుకున్న వారమవుతాము.

మరింత సమాచారం తెలుసుకోండి: