సాధారణంగా గర్భం దాల్చిన స్త్రీలకు పొట్ట పెరగడం సర్వసాధారణమే.చాలామందికి డెలివరీ తర్వాత పొట్ట అంత ఎత్తుగా కనబడదు.కానీ కొంతమందిలో డెలివరీ తర్వాత కూడా పొట్ట ప్రెగ్నెంట్ సమయంలో ఉన్నదానికంటే ఎక్కువగా ఉంటుంది.అలా ఉండడం వల్ల పక్కన వారు కూడా ఆ స్త్రీలు మళ్లీ ప్రెగ్నెంట్ అని అడుగుతుంటారు కూడా..

అటువంటి స్త్రీలు డెలివరీ తర్వాత వచ్చే పొట్టను పోగొట్టుకోవడానికి వారి రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ మాత్రం మార్పులు కనబడక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు, వారు తీసుకునే డైట్లలో కొన్ని రకాల పానీయాలను ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల తొందరగా కరిగించుకోవచ్చు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.అ పానీయాలు తాగడం వల్ల వారి మెటబాలిజం బాగా పెరిగి,పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగిస్తాయని,దానితో వారి నడుము నాజుగ్గా తయారవుతుందని కూడా చెబుతున్నారు.మరి ఇంకెందుకు ఆలస్యం అవేంటో మనము తెలుసుకుందాం పదండి..

గ్రీన్ టీ..

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించడం వల్ల బరువు తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే క్యాటెచిన్ కాంపౌండ్ బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది.కావున స్త్రీలు డెలివరీ అయిన 6 నెలల తర్వాత నుండి గ్రీన్ టీ తాగటం ఉత్తమం.

ధనియా వాటర్..

ధనియాలు వేగంగా బరువు తగ్గడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.వీటిని రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో ఒక చెంచాడు వేసి నానబెట్టండి.మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటితో సహా ఉడకబెట్టి తాగడం వల్ల,జీర్ణక్రియ జరిగి వాపులు తగ్గుతాయి.మరియు ఇది శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో ఉపయోగపడుతుంది.

జీలకర్ర టీ..

జీలకర్ర టీ పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడానికి చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది.దీనివల్ల బరువు పెరగరు.అంతే కాకుండా,జీలకర్ర శరీరం యొక్క జీవక్రియను పెంచడానికి కూడా పనిచేస్తుంది.

యాపిల్ సైడర్ వెనిగర్..

రోజు దీనిని త్రాగటం ప్రారంభిస్తే, ఆరోగ్యానికి సంబంధించిన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడంతో,పొట్ట చుట్టూ కొవ్వు కరిగి బరువు తగ్గడమే కాకుండా,రక్తంలో చక్కెర స్థాయి కూడా అదుపులో ఉంచుతుంది.

బ్లాక్ టీ..

రోజూ బ్లాక్ టీ తీసుకోవడంతో మెటబాలిజం రేటు పెరిగి, పొట్ట చుట్టూ ఉన్న పువ్వును కరిగించడంలో చాలా బాగా పనిచేస్తుంది. కావున డెలివరీ తర్వాత వచ్చే పొట్టను ఈజీగా తగ్గించుకోవడానికి బ్లాక్ టీ బాగా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: