మధుమేహంకి ఈ పండుతో చెక్ పెట్టొచ్చు ?

ఈ రోజుల్లో మధుమేహం చాలా దారుణంగా పెరిగిపోతుంది. చాలా మంది దీనిని లైట్ తీసుకుంటారు. కానీ ఇది అన్ని జబ్బుల కంటే చాలా ప్రమాదకరం. ఇక మధుమేహానికి ప్రధాన కారణం ఊబకాయం. స్ట్రాబెర్రీలను తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఎందుకంటే వాటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. మధుమేహం గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. స్ట్రాబెర్రీలు చెడు LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం, రక్తనాళాల పనితీరును మెరుగుపరచడం ద్వారా గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు సమతుల్య ఆహారంలో భాగంగా స్ట్రాబెర్రీలను తినవచ్చు. అలాగే స్ట్రాబెర్రీలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.స్ట్రాబెర్రీలో ఫైబర్ ఉంటుంది. ఇది చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుంది. మధుమేహంకి ఈ పండుతో చెక్ పెట్టొచ్చు.


అలాగే, ఫైబర్ బరువు నియంత్రణలో సహాయపడుతుంది. మధుమేహ నియంత్రణలో ఇది మరొక ముఖ్యమైన అంశం. స్ట్రాబెర్రీలలో ఆంథోసైనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్, యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి. స్ట్రాబెర్రీ శోథ నిరోధక ప్రభావాలు ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తాయి.స్ట్రాబెర్రీ అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన బెర్రీ పండు. స్ట్రాబెర్రీలు తీపి, టార్ట్ రుచిని కలిగి ఉంటాయి. వివిధ ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడే విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. స్ట్రాబెర్రీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. స్ట్రాబెర్రీలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులకు స్ట్రాబెర్రీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. స్ట్రాబెర్రీలు సహజ తీపితో ఉన్నప్పటికీ తక్కువ గ్లైసెమిక్ కలిగి ఉంటాయి. అంటే, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: