ఈ మధ్యకాలంలో ఎక్కువగా అందరూ ఒబిసిటీ ప్రాబ్లం తో బాధపడిపోతున్నారు . మరీ ముఖ్యంగా 14 - 15 ఏజ్ లోనే  ఒబిసిటీ కి గురి అవుతున్నారు. చాలామంది ఒబిసిటీ ప్రాబ్లం తో బాధపడుతూ ఉండడం మనం మన చుట్టుపక్కల చూస్తూనే వస్తున్నాం.  అయితే ఇలా ఒబిసిటీ తో బాధపడే వారు ఎక్కువగా డైటింగ్ అంటూ ఫాలో అవుతూ తెల్ల అన్నం తినడం మానేస్తున్నారు.  డాక్టర్లు కూడా చాలా మంది తెల్ల అన్నం తినకూడదు అని చెప్పుతున్నారు. అలా  తెల్ల అన్నం ప్లేస్ లో వేరే మిల్లెట్స్ ఫుడ్ ని ఓట్స్ రీప్లేస్ చేయాలి అని సూచిస్తున్నారు.


కానీ కొంతమందికి పుట్టినప్పటినుంచి తెల్ల అన్నం తినడం ఒక అలవాటుగా మారిపోయి ఉంటుంది . అలాంటి వాళ్ళు తెల్ల అన్నం  తినకపోతే ఎంత హై ప్రోటీన్ ఫుడ్ తిన్న కడుపు నిండనే నిండదు . అలాంటి వాళ్ళ కోసం డాక్టర్లు కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారు . మరీ ముఖ్యంగా తెల్ల అన్నం తినకుండా ఉండలేం అనే వాళ్ళు .. బాగా ఎక్కువగా బరువుతో  బాధపడిపోతున్న వాళ్లకి కొన్ని చిట్కాలు అందిస్తున్నారు.  తెల్ల అన్నం ఒక చిన్న కప్పుకు పెట్టుకొని .. మిగతా కూరలు ఎక్కువగా పెట్టుకుని తింటే అన్నం కడుపు నిండా తిన్న ఫీలింగ్ కలుగుతుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు .



మరి ముఖ్యంగా మనం భోజనం చేసే ప్లేట్లో ప్రోటీన్ - కార్బ్స్ - ఫ్యాట్స్ అన్ని ఉండాలి.  ఆ కారణంగానే ఒక కప్పు తెల్ల అన్నం.. ఒక చిన్న కప్పు పెరుగు .. ఎక్కువగా ఆకుకూరలు.. కాయగూరలు పెట్టుకొని తినడం మంచిది అంటున్నారు . మరి కొందరు తెల్ల అన్నం తినాలి అనుకునే వాళ్ళు అన్నం వండుకునే రెండు గంటల ముందే బియ్యంని బాగా శుభ్రపరచుకొని నానబెట్టుకొని రెండు గంటల తర్వాత ఆ బియ్యాన్ని గెంజి వాడ్చి వండుకొని తింటే బరువు ఎక్కువగా పెరగరు అని .. డయాబెటిస్ పేషంట్స్ కూడా ఈ విధంగా తెల్ల అన్నం తినవచ్చు అని చెప్తున్నారు.  అంతేకాదు డయాబెటిక్ పేషంట్స్ వేడిగా ఉన్న తెల్ల అన్నం తినడం కన్నా చల్లగా ఉన్న తెల్ల అన్నం తినడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది అని సూచిస్తున్నారు.



నోట్: ఇక్కడ అందించినది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. మీరు ఏదైన పాటించే ముందు మీ దగ్గరలోని డాక్టర్ ని సంప్రదించండం ఉత్తమం అని గుర్తు పెట్టుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: