
వర్షాకాలంలో ఈగల బాధ ఎక్కువగా కనిపిస్తుంది. అవి మన ఆరోగ్యానికి హానికరం కావడంతోపాటు, ఇబ్బందికర పరిస్థితులు ఏర్పరుస్తాయి. ఇంటిలో దొరికే సహజ పదార్థాలను ఉపయోగించి ఈగలను సులభంగా దూరంగా ఉంచవచ్చు. ఉదాహరణకు, ఉప్పు మరియు నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ఈగలు ఎక్కువగా కనిపించే ప్రదేశాల్లో చల్లితే, వాటి వాసన ఈగలను అడ్డుకుంటుంది. ఇదే విధంగా, ఒక గ్లాసు పాలలో కొద్దిగా మిరియాలు, చక్కెర కలిపి ఉంచితే, ఈగలు అందులో పడిపోయి చనిపోతాయి.
యాపిల్ సైడర్ వెనిగర్ వాసన ఈగలకు నచ్చదు కాబట్టి, కొద్దిగా వెనిగర్‌ను నీటితో కలిపి స్ప్రే చేయడం ద్వారా ఈగలను ఇంట్లోకి రాకుండా నిరోధించవచ్చు. అలాగే కర్పూరాన్ని నీటిలో వేసి మరిగించి, ఆ నీటిని ఈగలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో చల్లితే, వాటి వాసన ఈగలను పారద్రోలుతుంది. తులసి లేదా పుదీనా ఆకులను గ్రైండ్ చేసి పేస్టుగా తయారుచేసి, ఈగలు కనిపించే ప్రదేశాల్లో చల్లితే కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి.
ఇవి కాకుండా, ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడం ఎంతో అవసరం. చెత్తను రోజూ పారవేయడం, చెత్త డబ్బాలకు మూత పెట్టడం, ఆహార పదార్థాలను మూసి ఉంచడం వంటి సాధారణ చర్యల ద్వారా ఈగల సంచారం తగ్గించవచ్చు. వంటగది లేదా బాత్రూమ్ కాలువల దగ్గర కనిపించే డ్రెయిన్ ఫ్లైస్‌ను నియంత్రించడానికి వేడినీరు, బేకింగ్ సోడా, వెనిగర్ మిశ్రమాన్ని కాలువల్లో పోస్తే ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ విధంగా ఇంటిలో అందుబాటులో ఉండే సహజ పదార్థాలతో ఈగల సమస్యను పరిష్కరించవచ్చు. రసాయనిక మందులను ఎక్కువగా ఉపయోగించకుండా సురక్షితమైన మార్గాల్లో ఈగలను నియంత్రించడమే శ్రేయస్కరం.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు