
ప్రోటీన్ లేకపోతే కండరాలు క్షీణిస్తాయి. దీనివల్ల నడవడంలో, నిలబడడంలో ఇబ్బందులు వస్తాయి. జుట్టు రాలడం, గోర్లు బలహీనంగా మారడం, చర్మం పొడిబారడం వంటివి ప్రోటీన్ లోపం వల్ల కనిపిస్తాయి. ప్రోటీన్ సరిగా లేకపోతే రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. దీనివల్ల తరచుగా జలుబు, దగ్గు వంటి వ్యాధులు వస్తాయి. ప్రోటీన్ తక్కువగా ఉండే ఆహారం తింటే త్వరగా ఆకలి వేస్తుంది.
పప్పులు, పల్లీలు, శనగలు, రాజ్మా వంటివి ప్రోటీన్‌కు మంచి మూలాలు. వీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. గుడ్డులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అల్పాహారంలో గుడ్డు ఉడకబెట్టి తినడం వల్ల మంచి ప్రోటీన్ లభిస్తుంది. పాలు, పెరుగు, పన్నీర్, ఛీజ్ వంటివి కూడా ప్రోటీన్ అందిస్తాయి. ఒక కప్పు పెరుగు లేదా ఒక గ్లాసు పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది.
మీరు మాంసాహారులైతే, చికెన్, చేపలు, మటన్ వంటివి తినడం ద్వారా మంచి ప్రోటీన్ పొందవచ్చు. బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు (sunflower seeds) వంటివి ప్రోటీన్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులను కూడా అందిస్తాయి. ఈ చిట్కాలు పాటించడం ద్వారా ప్రోటీన్ లోపాన్ని సులభంగా అధిగమించవచ్చు. ఒకవేళ మీ సమస్య తీవ్రంగా ఉంటే, తప్పకుండా వైద్య నిపుణుడిని సంప్రదించండి. మీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. ప్రోటీన్ లోపంతో బాధ పడేవాళ్ళకు ఈ చిట్కాలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.