అధికార వైసీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు పావు వంతు ఎమ్మెల్యేలు తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారని సర్వేలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే మరికొదరు ఎమ్మెల్యేలు సైతం కాస్త ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురుకుంటున్నారని తెలుస్తోంది. అంటే సగం పాజిటివ్, సగం నెగిటివ్ ఆ ఎమ్మెల్యేలకు ఉందని చెప్పొచ్చు. అలా సగం సగం ఉన్న ఎమ్మెల్యేల్లో తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు కూడా ఒకరని చెప్పొచ్చు.

2009 ఎన్నికల తర్వాత 2019 ఎన్నికల్లో మరొకసారి తణుకు నుంచి గెలిచిన కారుమూరి....తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందున్న కారుమూరి, సమస్యలున్న ప్రజల ఇంటికే నేరుగా వెళ్తారు. అటు పార్టీ కార్యాలయంలో కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటూ, అర్హులైన ప్రతిఒక్కరికీ పథకాలు అందేలా చేస్తున్నారు. ప్రభుత్వం తరుపున జరిగే ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తణుకులో జరుగుతున్నాయి. ఇవే ఎమ్మెల్యేకు ప్లస్ అవుతున్నాయి.

ఇక నెగిటివ్ వచ్చి....ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం పెంచడం. అటు తణుకులో ఇళ్ల స్థలాల్లో చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు రావడం. ఇసుకలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. నియోజకవర్గంలో రోడ్లు దారుణంగా ఉన్నాయి....రోడ్లు వేసేస్తున్నామని ఎప్పటికప్పుడు చెప్పినా సరే, అవి అలాగే ఉంటున్నాయి. అత్తిలిలో మార్కెట్ యార్డు, డ్రైనేజీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. వేసవి వచ్చిందంటే నియోజకవర్గంలో తాగునీటి సమస్య కూడా ఎక్కువే.

రాజకీయ పరంగా చూసుకుంటే ఎమ్మెల్యేగా కారుమూరి ఎవరేజ్ మార్కులు తెచ్చుకుంటున్నారు. అయితే ఈ మైనస్‌లు పెరిగితే ఎమ్మెల్యేకు నెక్స్ట్ ఎన్నికల్లో ఇబ్బందే. పైగా ఇక్కడ టి‌డి‌పి నేత అరిమిల్లి రాధాకృష్ణ వేగంగా పుంజుకుంటున్నారు. దీనికి తోడు టి‌డి‌పి-జనసేనలు కలిస్తే సరే ఎమ్మెల్యేకు కష్టమే. గత ఎన్నికల్లో కారుమూరి, అరిమిల్లిపై కేవలం 2 వేల ఓట్లతో గెలిచారు. అదే సమయంలో ఇక్కడ జనసేనకు 31 వేల ఓట్లు పడ్డాయి. అంటే టి‌డి‌పి-జనసేనలు కలిస్తే కారుమూరి పరిస్తితి ఏంటో అర్ధమైపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: