గత ఎన్నికల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు కేవలం జగన్ ఇమేజ్, టీడీపీ వ్యతిరేక గాలిలో గెలిచారంటే...చాలామంది ఎమ్మెల్యేలు గెలిచారని చెప్పొచ్చు. వైసీపీ నుంచి గెలిచిన 151 మందిలో మెజారిటీ ఎమ్మెల్యేలు జగన్ ఇమేజ్ లేదా టీడీపీపై ఉన్న వ్యతిరేకతతో గెలిచారని చెప్పొచ్చు. అంటే ఆ ఎమ్మెల్యేలు ఏమి సొంత ఇమేజ్‌తో గెలవలేదనే చెప్పాలి. అలా గెలిచినవారిలో నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు కూడా ఒకరు.

స్వతహాగా డాక్టర్ అయిన జగన్మోహన్ 2014లోనే వైసీపీ తరుపున బరిలో దిగి ఓటమి పాలయ్యారు. కానీ 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో ఈ జగన్ ఎమ్మెల్యేగా గెలిచేశారు. ఎందుకంటే నందిగామ నియోజకవర్గంలో టీడీపీపై వచ్చిన వ్యతిరేకత కూడా జగన్ గెలుపుకు కారణమైంది. మామూలుగా నందిగామ అంటే టీడీపీ కంచుకోట. ఇక్కడ ఆ పార్టీకి తిరుగులేదు. కానీ 2014 తర్వాత సరిగ్గా నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉండలేకపోయింది.

అందుకే ప్రజలు వైసీపీ వైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే జగన్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా జగన్ పర్వాలేదనిపించేలా పనిచేసుకుంటూ వెళుతున్నారు. ఈ రెండున్నర ఏళ్లలో అబ్బా అద్భుతంగా పనిచేస్తున్నారని అనిపించుకోలేకపోయినా, పర్లేదులే బాగానే పనిచేస్తున్నారని మాత్రం అనిపించుకుంటున్నారు. ఎందుకంటే సమయానికి ప్రభుత్వ పథకాలు అందడం...ప్రభుత్వం తరుపున్ పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగడం వల్ల జగన్‌కు ప్లస్ అవుతుంది.

అలా కాకుండా నందిగామలో కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు ఏమి లేవు...రోడ్ల పరిస్తితి అలాగే ఉంది...నియోజకవర్గంలో కీలకమైన సుబాబుల్ రైతుల సమస్యలు తీరడం లేదు. తాగునీటి కొరత కూడా ఉంది. రాజకీయంగా వస్తే స్థానిక ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అదిరిపోయే విజయాల్ని సొంతం చేసుకుంది. అయితే స్థానిక ఎన్నికలకు సాధారణ ఎన్నికలకు తేడా వస్తుంది. పైగా ఇక్కడ టీడీపీ కూడా వేగంగా పుంజుకుంటుంది. టీడీపీ నాయకురాలు తంగిరాల సౌమ్య యాక్టివ్ గానే పని చేస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ ఎమ్మెల్యే జగన్‌కు మళ్ళీ ఛాన్స్ వస్తుందా? రాదా? అనేది కాస్త డౌటే.  

మరింత సమాచారం తెలుసుకోండి: