ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. కానీ బలంగా ఉన్న కాంగ్రెస్‌కు చెక్ పెట్టి నల్గొండలో కారు హవా నడవటంలో మంత్రి జగదీష్ రెడ్డి పాత్ర ముఖ్యమైనదే అని చెప్పాలి. టీఆర్ఎస్‌లో మొదట నుంచి పనిచేస్తూ వస్తున్న జగదీష్ రెడ్డి..నల్గొండలో కారు స్పీడ్ పెంచడంలో కృషి చేశారు. అలాగే కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న సూర్యాపేటలో వరుసగా సత్తా చాటుతూ వస్తున్నారు.

2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలిచి...కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేస్తున్నారు. ఇక మంత్రిగా జగదీష్ రెడ్డి పాత్ర కాస్త ప్రభావం తక్కువ ఉందనే చెప్పాలి. ఏ మంత్రి అయినా కేసీఆర్ ఏం చెబితే అదే చేయాలి..దీని వల్ల మంత్రిగా సత్తా చాటే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పైగా జగదీష్ రెడ్డి మంత్రిగా అంతగా సత్తా చాటలేకపోయారు. ఇక ఎమ్మెల్యేగా సూర్యాపేటలో ఎలా పనిచేస్తున్నారంటే? బాగానే పనిచేస్తున్నారని చెప్పొచ్చు.

వరుసగా రెండు సార్లు గెలిచిన జగదీష్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు బాగానే చేశారు. అయితే మంత్రి అయ్యాక జగదీష్ రెడ్డి..ప్రజలకు అందుబాటులో ఉండటం తక్కువని తెలుస్తోంది. పైగా జిల్లాపై ఈయన పెత్తనం చేయడం మిగిలిన కారు ఎమ్మెల్యేలకు నచ్చడం లేదు. అలాగే నియోజకవర్గంలో ప్రజా సమస్యలని పూర్తిగా పరిష్కరించడంలో జగదీష్ కాస్త వెనుకబడి ఉన్నట్లే కనిపిస్తోంది.

ఇక మంత్రి జగదీష్‌పై అనేక ఆరోపణలు కూడా వచ్చాయి...ఆంధ్రా వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకుని కాంట్రాక్టులు ఇప్పించారని, తక్కువ ధరకే బినామీల పేరుతో భూములని కొనుగోలు చేశారని, ఇక సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయం నిర్మాణం కోసం స్థలం ఎంపికలో భారీ కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ నేతలు, జగదీష్‌పై ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు మంత్రిగా మైనస్ అవుతున్నాయి. పైగా రెండు సార్లు గెలవడంతో సహజంగానే వ్యతిరేకత వచ్చింది. అటు కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డిపై ఓడిపోయిన సానుభూతి ఉంది. ఈ సారి ఎన్నికల్లో మాత్రం జగదీష్‌కు హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ దామోదర్ రెడ్డి ఇచ్చేలా లేరు.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

trs