ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా శుభవార్తను తెలిపారు. అదేమిటంటే అర్హులై సంక్షేమ పథకాలు అందని ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం సరికొత్త శుభవార్త తీసుకురావడం జరిగింది.ఇకపోతే ఎవరైనా సరే పథకాలకు అర్హులయి.. కానీ వివిధ కారణాలవల్ల ప్రభుత్వ పథకాలు పొందలేకపోయిన వారికి లబ్ధి చేకూరాలని సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ క్రమంలోనే అర్హులైనా.. సంక్షేమ పథకాలు అందని వారికి ఈరోజు ఆర్థిక సహాయం చేయడానికి కంకణం కట్టారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇకపోతే ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ అలాగే జూన్ నెలలో సమీక్ష నిర్వహించాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..

ఇకపోతే లబ్ధిదారుల ఖాతాల్లో సుమారుగా రూ.137 కోట్ల రూపాయలను జమ చేయనున్నారు.  ఈరోజు సుమారుగా 9,30,809 మంది అర్హులైన లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాలోని వివిధ పథకాల కింద 137 కోట్ల రూపాయలను జమ చేస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇకపోతే ఇప్పటికే అర్హులై ఉండి డబ్బు పొందని వారు మీ ఖాతాలను మరొకసారి చెక్ చేసుకోగలరు. ఇదిలా ఉండగా భద్రాచలం వంటి కోస్తా ఆంధ్ర ప్రాంతాలు నీట మునిగిన నేపథ్యంలో వరద తగ్గుముఖం పట్టిన వెంటనే పది రోజులలో పంట , ఆస్తి నష్టాలపై అంచనాలు పూర్తి చేయాలి అని అధికారులకు ఆదేశించారు.

ఇక ఆ తర్వాత రైతులకు తగినంత నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందని ఆయన ఈరోజు ప్రకటించడం జరిగింది. ఇకపోతే ప్రస్తుతం వారికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళదుంపలు, కేజీ పామాయిల్ .. వచ్చే 48 గంటల్లో అందజేయాలి అని అధికారులకు స్పష్టం చేశారు. ఇకపోతే ముంపుకు గురైన ప్రతి గ్రామంలో పంపిణీ ముమ్మరం చేయాలి అని కలెక్టర్, సీనియర్ అధికారులు దీన్ని సవాల్ గా తీసుకోవాలని సీఎం జగన్ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: