ఒకప్పుడు తన అందచందాలతో కుర్రాళ్లను మైమరపించిన హీరోయిన్ స్నేహ ఉల్లాల్.  అప్పట్లో ఈ ముద్దుగుమ్మను జూనియర్ ఐశ్వర్యారాయ్ అనేవారు..అచ్చం ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ లాంటి కళ్లు..ముఖం ఉండటంతో స్నేహ ఉల్లాల్ అలా పిలిచే వారు.  తెలుగు, తమిళ, హిందీ బాషల్లో నటించిన సినిమాలు కొన్నే అయినా..గ్లామర్ పాత్రలతో బాగా ఆకట్టుకుంది. 

హీరోయిన్ తాను మంచి స్థాయికి వస్తున్న అనుకుంటున్న సమయంలోనే అనుకోకుండా ఆనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నట్లు వార్తలు రావడం..సినిమాలకు దూరం కావడం జరిగింది.  అయితే అప్పట్లో తనకు ఎలాంటి జబ్బూ లేదని.. తాను సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నానని స్నేహా ఉల్లాల్ స్టేట్ మెంట్ ఇచ్చింది.  కాకపోతే సినిమా ఛాన్సులు రావడం లేదని కూడా బాధపడింది.  


అందు కోసం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటో షూట్స్ కూడా పోస్ట్ చేస్తూ..దర్శక నిరమాతలను ఆకర్షించే ప్రయత్నం చేసింది.  అయితే ఇప్పుడు నిజంగానే అనారోగ్యంతా బాధపడుతున్నట్లు కనిపిస్తుంది స్నేహా ఉల్లాల్.   లైఫ్ లో ఫస్ట్ టైమ్ హాస్పిటల్ బెడ్ ఎక్కినట్లు స్నేహ ఉల్లాల్ తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పింది.

గత కొంత కాలంగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని అందుకే హాస్పిటల్ చేరాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది.  జ్వరం ఎక్కువవ్వడంతో మొన్నటివరకు చాలా భయపడినట్లు చెప్పిన స్నేహ ఉల్లాల్ ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడినట్లు తెలిపింది. తనను కొంత కాలంగా వైద్యులు రెస్ట్ తీసుకోమన్నారని..మీ ఆశీర్వాదం..అభిమానం వల్ల తర్వరగా కోలుకుంటానని పోస్ట్ చేసింది. తెలుగులో అల్లరి నరేష్ నటించిన ‘మడత ఖాజా ’ స్నేహా ఉల్లాల్ చివరి సినిమా. 


మరింత సమాచారం తెలుసుకోండి: