టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు నుండి ఇప్పటికే రిలీజ్ అయిన నాలుగు సాంగ్స్ కూడా శ్రోతలను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. ఇకపోతే మొన్న ఈ సినిమా నుండి ఐదవ సాంగ్ అయిన డాంగ్ డాంగ్ అనే పల్లవితో సాగె సాంగ్ వీడియో ప్రోమోని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఆ సాంగ్ లో మహేష్, తమన్నా ల డాన్స్ కు సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో థ్రిల్ అయ్యారు. 

 

ఇక ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. ఫుల్ సాంగ్ ఎంతో అదిరిపోవడంతో పాటు , తప్పకుండా ఈ సాంగ్ రేపు సినిమా రిలీజ్ తరువాత థియేటర్ లో అదరగొట్టడం ఖాయం అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నకాష్ అజిజ్, లావిటో లోబో సూపర్బ్ గా పాడిన ఈ సాంగ్ కు దేవిశ్రీ అదిరిపోయే ట్యూన్ ఇవ్వగా, రామజోగయ్య శాస్త్రి మంచి సాహిత్యాన్ని అందించారు. ఇక ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. 

 

సూపర్ స్టార్ మహేష్ ఒక మిలిటరీ మేజర్ గా, అలానే కర్నూలు యువకుడిగా రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ద్వారా సీనియర్ నటి విజయశాంతి చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తుండడం విశేషం. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై మహేష్, దిల్ రాజు, అనిల్ సుంకర ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీనివాస రెడ్డి, రావు రమేష్, రఘు బాబు, హరితేజ, సంగీత, బండ్ల గణేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను జనవరి 11న రిలీజ్ చేయనున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: